cloudfront

Advertisement


Home > Movies - Movie News

నైజాంలో తేడా కొడుతున్న భరత్

నైజాంలో తేడా కొడుతున్న భరత్

మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా హిట్ అయిన మాట వాస్తవం. తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయనేది కూడా నిజం. కానీ రికార్డుల వేటలో పడి కొన్ని ఏరియాల్లో ఈ సినిమా వసూళ్లను కావాలనే ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా నైజాం విషయంలో ఈ లెక్క కాస్త ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ట్రేడ్ ఎనలిస్ట్ లు చెబుతున్న ప్రకారం.. నైజాంలో భరత్ అనే నేను సినిమాకు 4కోట్ల 45లక్షల రూపాయల (షేర్) వసూళ్లు వచ్చాయి. మరికొందరు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు మాత్రం ఈ సినిమా మొదటి రోజు షేర్ ను 5కోట్ల 55లక్షల రూపాయలుగా చెబుతున్నారు. తక్కువ థియేటర్లు దొరికిన భరత్ కు ఈ స్థాయిలో వసూళ్లు రావడం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు.

నైజాంలో నాన్-బాహుబలి రికార్డు కోసమే ఇలా వసూళ్లను ఎక్కువ చేసి చెప్పారనే ప్రచారం సాగుతోంది. ఈ ఏరియాలో బాహుబలి-2, బాహుబలి-1 తర్వాత జనతా గ్యారేజ్, అజ్ఞాతవాసి చిత్రాలు నిలిచాయి. ఈ రెండు సినిమాల మధ్య కూడా నాన్-బాహుబలి రికార్డు కోసం మొన్నటివరకు చాలా రచ్చ జరిగింది. ఆ విషయాన్ని పక్కనపెడితే, ఈ రెండు సినిమాల్ని అధిగమించి భరత్ అనే నేను మొదటి రోజు వసూళ్లను చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

రంగస్థలం మూలంగా మహేష్ సినిమాకు నైజాంలో థియేటర్లు తక్కువ దొరికాయని స్వయంగా నిర్మాత చెప్పుకొచ్చారు. పేపర్ యాడ్స్ లో ఉన్న లిస్ట్ ప్రకారం చూసుకుంటే.. 280-300 థియేటర్లు మాత్రమే దీనికి దక్కాయి. అలాంటప్పుడు నాన్-బాహుబలి రికార్డు ఎలా సాధ్యం అంటున్నారు పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ మేటర్ పై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.