అమితాబ్ కు కరోనా ఇలా వచ్చి ఉండొచ్చు

లాక్ డౌన్ మొదలవ్వకముందే ముంబయిలోని తన ఇంటికి పరిమితమైపోయారు అమితాబ్. ఒక టైమ్ లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హోం క్వారంటైన్ లో కూడా ఉండిపోయారు. తను 2 వారాల పాటు హోమ్ క్వారంటైన్…

లాక్ డౌన్ మొదలవ్వకముందే ముంబయిలోని తన ఇంటికి పరిమితమైపోయారు అమితాబ్. ఒక టైమ్ లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హోం క్వారంటైన్ లో కూడా ఉండిపోయారు. తను 2 వారాల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నట్టు గతంలో ప్రకటించిన బిగ్ బి, దానికి సంబంధించిన స్టాంప్ కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న అమితాబ్ కు కరోనా ఎలా సోకిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీనికి సమాధానంగా అందరూ చెబుతున్నది ఒకే ఒక్కటి. అదే కౌన్ బనేగా కరోర్ పతి ఆడిషన్స్. అవును.. కొన్ని రోజుల కిందట ఈ ఆడిషన్స్ కోసం ఓ స్టుడియోకు వెళ్లారు బిగ్ బి. అక్కడ కూడా ఆయన పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. చేతులకు గ్లౌజెస్, ముఖానికి మాస్క్, శానిటైజర్ ఇలా  అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే స్టుడియోలో కొద్దిసేపు ఆయన మాస్క్ లేకుండా కనిపించారట. సరిగ్గా అప్పుడే ఆయనకు కరోనా వైరస్ సోకి ఉంటుందని బాలీవుడ్ కథనాలు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆడిషన్స్ జరిగిన కొన్ని రోజులకు శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు అమితాబ్. ఆ వెంటనే వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.

అలా బిగ్ బికి కరోనా సోకిన విషయం బయటకొచ్చింది. ఆ తర్వాత ఆ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించడం, వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం అందరికీ తెలిసిన విషయాలే.

మామా కోడలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్