Advertisement

Advertisement


Home > Movies - Movie News

స‌ల్మాన్ రెమ్యున‌రేష‌న్‌లో భారీ కోత‌

స‌ల్మాన్ రెమ్యున‌రేష‌న్‌లో భారీ కోత‌

కండ‌ల వీరుడు, బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్ హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలు చూర‌గొన్నారు. వ‌చ్చే నెల 3 నుంచి హిందీలో బిగ్‌బాస్ సీజ‌న్‌-14 ప్రారంభం కానుంది. ఈ షోకు స‌ల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా భారీ మొత్తంలో రూ.250 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12.50 కోట్లు చొప్పున సీజ‌న్ మొత్తానికి 12 వారాల‌కు ఈ మొత్తం తీసుకున్న‌ట్టు బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున టాక్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న రియాల్టీ షోకు సంబంధించి రెమ్యున‌రేష‌న్‌లో భారీ కోత విధించిన‌ట్టు స‌మాచారం. దీనికి కార‌ణం కోవిడ్‌-19 ప్ర‌భావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావ‌డ‌మే అని తెలుస్తోంది. త‌న రెమ్యున‌రేష‌న్‌లో కోత విధించ‌డాన్ని స‌ల్మాన్ స్వాగ‌తించిన‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది. ఈ విష‌య‌మై స‌ల్మాన్ ఖాన్ స్పందిస్తూ త‌న జీతాన్ని క‌ట్ చేసి బిగ్ బాస్ షో సిబ్బందికి చెల్లించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

దీంతో స‌ల్మాన్ రెమ్యున‌రేష‌న్‌లో భారీ కోత విధించార‌నే వార్త‌లు నిజ‌మేన‌ని తెలిసిపోయింది. అస‌లు ఈ కోవిడ్ స‌మ‌యంలో తాను షో చేయ‌డానికి కార‌ణాలేంటో స‌ల్మాన్ చెప్పుకొచ్చారు.  ఈ సారి బిగ్ బాస్ సీజ‌న్‌-14 ద్వారా చాలా మందికి ఉపాధి ఉద్యోగ‌వ‌కాశాలు దొరుకుతాయని  చెప్పారు.  

కోవిడ్ కార‌ణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డ్డ విష‌యం తెలిసిందే. బుల్లితెర‌, వెండితెర క‌ళాకారులు కూడా చాలా మంది షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో నానా ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అలాంటి వాళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని రియాల్టీ షో చేయ‌డానికి ముందుకొచ్చిన‌ట్టు స‌ల్మాన్ చెప్పుకొచ్చారు. షో కోసం ప‌నిచేసే సిబ్బందికి ఎలాంటి క‌టింగ్స్ లేకుండా మొత్తం జీతాన్ని అంద‌జేస్తున్న‌ట్టు  స‌ల్మాన్ చెప్ప‌డం విశేషం. 

పవన్, బాబు ఒకరికి ఒకరు

అందరూ కలిసి బైటకి పంపేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?