ఐటం గర్ల్ మెహ్విష్ హయత్‌తో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్థాన్ ఇటీవల వెల్లడించ డంతో మరోసారి అతని గురించి ఇటు భారత్‌లోనూ, అటు ఆ దేశంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటం గర్ల్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత పాకిస్థాన్‌లో ప్రముఖ నటిగా ఎదిగిన మెహ్విష్ హయత్‌తో దావూద్ సంబంధాల గురించి సోషల్ మీడియాలో హాట్‌హాట్ చర్చ నడుస్తోంది.
దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉంటున్నాడు. గతంలో దావూద్ ముంబయ్‌లో ఉన్నప్పుడు కూడా బాలీవుడ్ నటీనటులతో సన్నిహిత సంబంధాలు నెరిపాడు. పలు బాలీవుడ్ సినిమాలకు ఆయన పెట్టుబడులు కూడా పెట్టాడు. ముంబయ్ బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా తేలిన తర్వాత దావూద్ మన దేశం నుంచి పారిపోయి పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడు.
అయితే ఇంతకాలం తమ దేశంలో దావూద్ లేనేలేడని బుకాయిస్తూ వచ్చిన పాకిస్థాన్…అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో చివరికి నిజాన్ని అంగీకరించక తప్పలేదు. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల పాకిస్థాన్ నటి మెహ్విష్ హయత్‌తో సంబంధాలున్న విషయమై చర్చకు దారి తీసింది. 2019లో మెహ్విష్‌కు పాక్ పౌర పురస్కారం ‘తమ్గా ఇంతియాజ్’ దక్కడానికి కూడా దావూద్ సిఫార్సే కారణమనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఐటం గర్ల్‌గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన మెహ్విష్…దావూద్ కంట్లో పడిన తర్వాతే దిశ, దశ మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దగా పాక్ చిత్రపరిశ్రమకు తెలియని మెహ్విష్‌కు పాక్ పురస్కారం లభించడం ఆ దేశ నటీనటులకు ఆశ్చర్యం కలిగించింది. దావూద్ పరిచయం వల్లే మెహ్విష్‌కు పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయని ఆ దేశ సోషల్ మీడియా రాసుకొస్తోంది. అంతేకాదు, ఆమెకు పెద్దపెద్ద సినిమాల్లో అవకాశాలు లభించడానికి కూడా దావూదే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.