Advertisement

Advertisement


Home > Movies - Movie News

నేను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను

నేను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను

సుశాంత్ సింగ్ మరణం తర్వాత డిప్రెషన్ పై కూడా చర్చ ఎక్కువైంది. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి డిప్రెషన్ కూడా ఓ కారణం అంటారు చాలామంది. దీనిపై హీరోయిన్ మెహ్రీన్ కూడా రియాక్ట్ అయింది. ఆల్రెడీ సీబీఐ, ఎన్సీబీ విచారణలో ఉన్న ఆ కేసుపై తను కొత్తగా స్పందించడానికేం లేదన్న మెహ్రీన్.. ఒత్తిడి మాత్రం జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసేస్తుందని చెప్పుకొచ్చింది. తను కూడా డిప్రెషన్ బాధితురాలినేనని ప్రకటించింది.

"ప్రతి ఒక్కరి జీవితంలో డిప్రెషన్ ఉంటుంది. నేను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను. దాన్నుంచి ఎంత త్వరగా బయటకొచ్చామన్నది ఇంపార్టెంట్. మనల్ని మనం నమ్మాలి, దేవుడ్ని నమ్మాలి. జీవితం చాలా అందమైనదనే విషయాన్ని పదేపదే గుర్తుచేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలి. అప్పుడు మాత్రమే డిప్రెషన్ నుంచి బయటపడగలం. నిజం చెప్పాలంటే ఈ బిజీ లైఫ్ లో మానవ జాతి మొత్తం డిప్రెషన్ ను ఫేస్ చేస్తోంది."

ఇలా తను కూడా కెరీర్ లో డిప్రెషన్ ను ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. ఇక తన అప్ కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుతూ.. తను ఎఫ్3లో కూడా ఉన్న విషయాన్ని బయటపెట్టింది మెహ్రీన్.

"ఎఫ్3లో నేను ఉన్నాను. నాతో పాటు ప్రైమరీ కాస్టింగ్ మొత్తం ఉంటుంది. కాకపోతే ఇంకా మేం కథ వినలేదు. కరోనా లేకపోతే ఈపాటికి సెట్స్ పైకి వచ్చేవాళ్లం. ఎఫ్2 అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎఫ్3కి ఇంతకంటే మంచి మీనింగ్ ఉంది. అది నేను చెప్పను. అనీల్ రావిపూడి చెబితేనే బాగుంటుంది."

ఇక ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పని మరో విషయాన్ని కూడా బయటపెట్టింది మెహ్రీన్. సినిమాల్లోకి రాకముందు తను మోడలింగ్ మాత్రమే చేశానని చాలామంది అనుకుంటున్నారని, కానీ తను ఎయిర్ పిస్టల్ గేమ్ లో నేషనల్ ప్లేయర్ అనే విషయాన్ని బయటపెట్టింది మెహ్రీన్. మూడు సార్లు నేషనల్స్ కు ఆడిందట ఈ బ్యూటీ. 

ఏపీ పోలీస్ సేవ యాప్ ప్రారంభ కార్యక్రమం

చంద్రబాబు వైఎస్ఆర్ ఇంటికొచ్చి డబ్బు ఆడిగేవాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?