Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాకు ఆర్థిక కష్టాలున్నాయి - శృతిహాసన్

నాకు ఆర్థిక కష్టాలున్నాయి - శృతిహాసన్

ఈ కరోనా టైమ్ లో సెలబ్రిటీలంతా హాయిగా ఇంటి పట్టున్న కూర్చున్నారనే అభిప్రాయం అందర్లో ఉంది. అందులో కొంత నిజం కూడా ఉంది. అదే టైమ్ లో అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న చాలామంది ఆర్టిస్టులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సందర్భాలు కూడా చూశాం. అయితే శృతిహాసన్ లాంటి స్టార్ హీరోయిన్ కు కూడా డబ్బు కష్టాలుంటాయా?

తనకు కూడా ఆర్థిక కష్టాలున్నాయంటోంది శృతిహాసన్. చాలామందిలా తను కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నానని, అయితే ఈ విషయంలో అమ్మా-నాన్న సహాయాన్ని కోరనని అంటోంది శృతిహాసన్.

"లాక్ డౌన్ టైమ్ లో చాలామంది స్మార్ట్ గా వ్యవహరించారు. నేను అలా చేయలేకపోయాను. సరిగ్గా లాక్ డౌన్ పడే సమయానికి కొద్ది రోజుల ముందు ఫ్లాట్ కొన్నాను. అదిప్పుడు నాకు ఆర్థికంగా చాలా భారమైంది. సరైన టైమ్ కు సినిమాలు కూడా లేకపోవడంతో కష్టాలు రెట్టింపు అయ్యాయి. ప్రతి నెలా వాయిదాలు కట్టడానికి డబ్బులు కావాలి కదా."

అందుకే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని చాలామందిలా తను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. షూటింగ్స్ మొదలైతే సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తానని, అప్పుడు డబ్బులు చేతికందుతాయని అంటోంది.

"నేను స్వతంత్ర భావాలుగల మహిళని. తప్పయినా, ఒప్పయినా నా జీవితంలో నిర్ణయాలన్నీ నేను సొంతంగా తీసుకున్నవే. ఇల్లు కొనాలనేది కూడా నా సొంత నిర్ణయమే. కాబట్టి దాని ద్వారా ఏర్పడిన ఆర్థిక కష్టాన్ని నేను భరించాల్సిందే. అమ్మా-నాన్నను అడక్కూడదని నిర్ణయించుకున్నాను."

తన సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా అంశాల్ని ఉన్నదున్నట్టుగా చెప్పేస్తుంటుంది శృతిహాసన్. ఈసారి ఇలా తన ఆర్థిక కష్టాల్ని ఏకరువు పెట్టింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?