cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

నేను, నా ఫ్యామిలీ న‌ర‌కం అనుభ‌వించాం

నేను, నా ఫ్యామిలీ న‌ర‌కం అనుభ‌వించాం

క‌రోనా ఫ‌స్ట్ వేవ్ కంటే సెకెండ్ వేవ్ ప్ర‌మాదకారిగా మారింది. త‌న ల‌క్ష‌ణాల‌ను మార్చుకుని ఏకంగా ప్రాణాలు తీసేందుకు సెకెండ్ వేవ్ పంజా విసురుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా బారిన ప‌డి, బ‌తికి బ‌ట్ట క‌ట్టిన వాళ్లు అదృష్ట‌వంతుల‌నే చెప్పాలి. అంతేకాదు, పున‌ర్జ‌న్మ‌గా భావిస్తున్న వారు లేక‌పోలేదు. ఈ క‌రోనా వైర‌స్ ప్ర‌త్యేక‌త ఏంటంటే పేద -ధ‌నిక‌, సామాన్యులు-సెల‌బ్రిటీల‌నే తార‌త‌మ్యాలు అస‌లు చూప‌దు.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బంద త‌న‌తో పాటు త‌న కుటుంబం క‌రోనా కార‌ణంగా చేదు అనుభ‌వాల‌ను ఎదు ర్కొన్న‌ట్టు చెప్పుకొచ్చారు. త‌న క‌ష్టాలు ఇత‌రుల‌కు రాకూడ‌ద‌ని ఆమె కోరుకుంటున్నారు. 

క‌రోనా బారిన ప‌డిన త‌ర్వాత వైద్యం తీసుకోవ‌డం కంటే, అస‌లు దానికి దూరంగా ఉండ‌డ‌మే ఉత్త‌మ‌మైన ప‌ని అంటూ చైత‌న్య‌ప‌రుస్తున్నారామె. బ‌య‌ట అడుగు పెడుతున్నారంటే మీ ప్రాణాల‌ను రిస్క్‌లో పెడుతున్న‌ట్టే అనే విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారామె.

అన్న‌ట్టు కృతి టాలీవుడ్‌కు సుప‌రిచిత‌మే. తీన్‌మార్‌, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ చిత్రాల్లో న‌టించి మెప్పించారు. త‌న క‌రోనా చేదు అనుభ‌వాలు ప‌ది మందిని అప్ర‌మ‌త్తం చేస్తాయ‌నే భావ‌న‌తో , వాటిని క‌ళ్ల‌కు క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ మేర‌కు ఆ ముద్దుగుమ్మ ట్వీట్ చేశారు.

"గ‌త 48 గంట‌ల్లో నేను, నా ఫ్యామిలీ న‌ర‌కం అనుభ‌వించాం. ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబ‌ట్టి ద‌య‌చేసి ఇంట్లో ఉండండి. బ‌య‌ట‌కు వెళ్లాల‌ని అనుకుంటే ప్రాణాన్ని రిస్క్‌లో పెడుతున్నార‌నే విష‌యాన్ని గ్ర‌హించి వెన‌క‌డుగు వేయండి. జీవితాల‌ని ఏ మాత్రం అశ్ర‌ద్ధ చేయొద్దు" అని కృతి క‌ర్బంద త‌న ఆవేద‌న‌ను ట్వీట్ రూపంలో వ్య‌క్త‌ప‌రిచారు. కృతి ట్వీట్ కొంద‌రిలోనైనా మార్పు తెస్తే ...అంత‌కంటే కావాల్సిందేముంది!

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×