Advertisement

Advertisement


Home > Movies - Movie News

కరోనాను కవ్విస్తున్న దర్శకుడు

కరోనాను కవ్విస్తున్న దర్శకుడు

కరోనాతో ప్రపంచం అంతా వణికిపోతోంది. కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత సంక్షోభంలో కూడా తనకు ఎలాంటి భయం లేదంటున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తను ఇప్పటివరకు మాస్క్ కూడా పెట్టుకోలేదని స్పష్టం చేశాడు 

"నేను ఎలాంటి కరోనా జాగ్రత్తలు తీసుకోలేదు. ఎందుకంటే నేను ఎవ్వర్నీ కలవడం లేదు. నేను నా ఇంట్లో ఉంటున్నాను. మాస్క్ పెట్టుకుంటే నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అసౌకర్యంతో ప్రతి సెకన్ చావడం కంటే ఒకేసారి కరోనా వచ్చి చావడం చాలా బెటర్. అందుకే మాస్క్ పెట్టుకోను. పైగా కరోనా వచ్చిందని నా లైఫ్ స్టయిల్ మార్చుకోవడం నాకు ఇష్టం లేదు."

ఇలా కరోనాను చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఈ దర్శకుడు. వరుస సినిమాలు తీస్తున్న ఈ టైమ్ లో కూడా తను టెక్నాలజీని వాడుకుంటాను తప్ప, జనాల్లోకి వెళ్లనని స్పష్టంచేస్తున్నాడు. వాట్సాప్ ద్వారా తన సినిమాల అప్ డేట్స్ తెలుసుకుంటానంటున్నాడు.

"నా వల్ల ఎవ్వరికీ కరోనా రాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఐసొలేషన్ లోనే ఉంటాను. భౌతిక దూరం అనేది ఎవరికి వాళ్లు పాటించాలి. నేను కచ్చితంగా పాటిస్తాను. అయితే కరోనా అంటే భయం మాత్రం లేదు. ఎఁదుకంటే మనం చనిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. అందులో కరోనా అనేది ఒక కారణం అంతే."

తనకు చావు అంటే కూడా భయం లేదంటున్నాడు వర్మ. అనారోగ్యానికి గురై, వేరే వ్యక్తిపై ఆధారపడే పరిస్థితి వస్తే కనుక తనను చంపేయమని, ఓ వ్యక్తికి సుపారీ కూడా ఇచ్చానని ప్రకటించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. తను మరణిస్తే ఏడవొద్దని తన కూతురికి ఇప్పటికే చెప్పానంటున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?