cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఇది భావోద్వేగ 'యాత్ర'.. సోషల్‌ మీడియా సలాం!

ఇది భావోద్వేగ 'యాత్ర'.. సోషల్‌ మీడియా సలాం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేపట్టిన 'ప్రజాప్రస్థానం' పాదయాత్రను కథాంశంగా తీసుకుని మహీ వీ రాఘవ్‌ దర్శకత్వంలో రూపొందిన 'యాత్ర' సినిమాకు సోషల్‌ మీడియా నీరాజనాలు పడుతోంది. 'యాత్ర'కు కేవలం వైఎస్‌ఆర్‌ అభిమానవర్గం నుంచినే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడి నుంచి కూడా కితాబులు అందుతున్నాయి. సినిమాను ప్రశంసిస్తూ వెబ్‌లో బోలెడన్ని పోస్టులు అగుపిస్తున్నాయి. అలాంటి వాటిలో వైరల్‌గా మారిన సోషల్‌ మీడియా పోస్టులు ఇవి..

''వచ్చే 75 రూపాయల పింఛను కోసం మరొకరి చావు కోరుకొంటూ బతుకుతున్న రోజులవి.

పండించిన పంటకు సరైన ధర లేని రైతు పెరిగిన విద్యుత్తు చార్జీల భారం మోయలేక పదిపైసలన్నా తగ్గించమంటే కాల్చేసిన రోజులవి.

బిడ్డ గుండెలో ఉన్న రంధ్రానికి రెండేదారులు (ఒకటి చావు, మరొకటి కుటుంబాన్నో, వంటినో అమ్ముకోవటం) ఉన్న రోజులవి.

పిల్లాడికి చదువుకోవాలని ఉన్నా చదువు ఖర్చు భరించలేక ఏ మారాజు ఇంటికో కూలికి పంపించే రోజులవి.

అర్ధరాత్రి వేళ ఏ గుండెపోటు వచ్చినా, గర్భిణీ డెలివరీకి వచ్చినా ఎక్కడో దూరాన ఉన్న ఆసుపత్రికి ఎలా వెళ్ళాలో తెలియక నలిగిపోయిన రోజులవి.

పాదయాత్రలో రాజశేఖరరెడ్డి ఈ సమస్యలు ఎలా తెలుసుకున్నారు అనేవరకే ''యాత్ర'' సినిమా. దానికి పరిష్కారాలు ఏమి చూపించాడు అనేది అందరికీ తెలిసినవే, చూపించనవసరం లేదు, చూపించలేదు కూడా.

మొదట్లో ఒకట్రెండు చిన్న సన్నివేశాలు అప్పటి అధికార పార్టీ మీద సెటైర్లు ఉన్నపటికీ, సినిమాలో పెద్దగా విమర్శల జోలికి వెళ్లకుండా ప్రజాసమస్యల మీద దృష్టిపెట్టి తీశారు. అప్పటి అధికార పార్టీ కంటే వైఎస్సార్‌ తన సొంత పార్టీలోని ప్రత్యర్థుల నుంచే ఎక్కువ ఇబ్బందిపడినట్లు చూపించారు.

సినిమాకి ముమ్ముట్టి ఒక అసెట్‌. అలాగే విజయమ్మ పాత్రధారిణి చక్కగా కుదిరింది. రెండు పాటలు కదిలిస్తాయి. ఆర్‌ఆర్‌ మొదట్లో కొంచెం ఎక్కువయింది అనిపించింది, తర్వాత బాగుంది. ఫోటోగ్రఫీ సినిమాకి హైలైట్‌.

కానీ, సినిమా పాదయాత్ర మీద అయినప్పుడు, ఎన్ని కిలోమీటర్లు నడిచారు, ఏ జిల్లాల మీదగా నడిచారు వంటి వివరాలు మిస్‌ అయ్యారు. యాత్ర అనే సినిమాకి వెళ్ళినప్పుడు ఆ యాత్ర గురించి అన్ని తెలియాలి, కానీ ఆ వివరాలు పూర్తిగా తెలియవు, కనీసం చివర్లో స్లైడ్‌గా కూడా తెలియపరచలేదు. చివర్లో వైఎస్సార్‌ మరణించినప్పుడు నిజమైన సీన్లు కలపటం వలన, సంపూర్తిగా అనిపిస్తుంది.

పాదయాత్ర మీద సినిమా అనే ఒక కష్టతరమైన సబ్జెక్టుని హృదయాన్ని కదిలిస్తూ హృద్యంగా చెప్పటంలో దర్శకుడు మహి విజయం సాధించినట్లే అని చెప్పుకోవాలి. కంగ్రాట్స్‌ టు ద యాత్ర టీం!''

-రఫీ షేక్‌

యాత్ర ఇది సినిమా కాదు ఇది ఒక మహా నాయకుని జీవితం...

ఆ మహానాయకుడు జీవితం అంతా ప్రజలతోనే.... 
ఆ ప్రజలకోసమే మనిషి రూపం దాల్చిన దేవుడయ్యాడు... 
పేదప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న అష్టదిక్పాలకులకు ఆప్తుడయ్యాడు...

అయన పాదయాత్ర ఒక ఆశయానికి తొలిమెట్టు...
ఆయన పాదయాత్ర తెలుగురాష్ట్రానికి ఒక వెలుగు తెచ్చింది...
ఆయన పాదయాత్ర తెలుగు ప్రజల ఆత్మాభినంకి నిలువెత్తు నిదర్శనం అయ్యింది..
ఆయన చూపు పేదప్రజలకు చల్లని చూపు...
మణికట్టులేని ఆయన చెయ్యి ఒక అక్షయపాత్ర....
రాజశేఖరా మీరు ఎప్పుడూ మా గుండెల్లో పధిలం.... మీ అజరామర యాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక చెరిగిపోని చరిత్ర.

-Viral post

యాత్ర ఇది సినిమా కాదు..
ఆగిపోయే పేదవాళ్ల గుండెలను ఆగకుండా చేసి అదే గుండెల్లో దేవుడుగా నిలిచిన ఒక మహా నాయకుడి జీవితం.

'యాత్ర' నీట్‌, షార్ప్‌ అండ్‌ బ్యూటిఫుల్‌! -మాన్వితా చిన్ను

'యాత్ర'ను మమ్ముట్టీ తన భుజాల మీద నడిపించేశారు. భారతీయ సినిమాకు ముఖచిత్రం లాంటి నటుడాయన. ఆఖరి పదినిమిషాలూ భావోద్వేగభరితం. వైఎస్‌ భక్తులను ఏడిపించేస్తుంది. -పీజే అరుణ్‌

తొడలు కొట్టాల్సిన పని లేదు.... మీసాలు తిప్పాల్సిన లేదు గుండెను హత్తుకుంటే చాలు యాత్ర -ఆలూరి లక్ష్మీనారాయణ చౌదరి

యాత్ర...!! జైత్రయాత్ర !!
వైఎస్‌ఆర్‌ క్యారక్టర్‌ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన సినిమా!! ఆవేశపరుడు నుంచి ఆలోచనాపరుడుగా, రాజకీయనాయకుడు నుంచి ప్రజా నాయకుడిగా మారడానికి చేసిన యాత్ర!!

ప్రభుత్వం ప్రచారానికి పెడుతున్న దుబారా ఖర్చుని తగ్గించుకొని, ప్రజల ఆరోగ్యానికి ఎలా ఖర్చుపెట్టొచ్చో, ఆరోగ్యబీమా కల్పించి ఎన్ని లక్షలమంది ప్రాణాలు కాపాడొచ్చో చూపించిన యాత్ర!!

అందరి క్షుద్భాధ తీర్చే రైతులు మాత్రం ఎప్పుడూ క్షామంతోనే ఎందుకు అలమటించాలి అని ఆలోచించి పరిష్కారం చూపించిన దార్శనికుని జీవితయాత్ర!!

జాతీయ పార్టీలో ఉన్నా, అధిష్టానానికి అణిగి మణిగి ఉండటం తన లక్షణం కాదని, ప్రజాదరణ ముందు అధిష్టానం కూడా తలొంచక తప్పదని, తలెత్తుకు తిరగడమే తన నైజమని తెలియజెప్పిన యాత్ర!!

No dramatization, no distortion, just depiction of legendary life of YSR.
-కృష్ణ మోహన్ రెడ్డి

బిగ్‌ బ్రేకింగ్‌ హిట్‌..
ఓవరాల్‌ మూవీ కేక..
మన గడప తొక్కిన సాయం కోరిన ఆడబిడ్డ తో ఏంట్రా రాజకీయం ఏంట్రా#YatraTheMovie
-యశ్వంత్‌

యాత్ర వెల్‌ డైరెక్టెడ్‌ మూవీ. వైఎస్‌ఆర్‌ పాత్రను మమ్ముట్టీ చాలా సహజంగా పోషించారు. ఎలాంటి అతిలేదు. ఈ సినిమాకు వెళ్లేవాళ్లు ఒక భావోద్వేగపూరిత యాత్రను చేస్తారు. బ్రిలియన్‌ ఫిల్మ్‌. 5/5 స్టార్స్‌.
-హర్ష రెడ్డి

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా