cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఇలియానా ఏంటి మరీ ఇలా మారిపోయింది?

ఇలియానా ఏంటి మరీ ఇలా మారిపోయింది?

"ఎవర్రా ఇది, కరువు దేశానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది."  ఓ సినిమాలో ఇలియానాపై పేలిన సెటైర్ ఇది. అంత స్లిమ్ గా ఉండేది ఈ గోవాబ్యూటీ. ఇప్పుడీమెపై ఇలాంటి డైలాగ్స్ రాయడం కుదరదు. అవును.. ఇలియానా ఇప్పుడు ఏమాత్రం స్లిమ్ కాదు. ఒకప్పుడు సైజ్ జీరోకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ భామ, ఇప్పుడు ఫక్తు తెలుగు సినిమా హీరోయిన్ లా బొద్దుగా మారింది. కావాలంటే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఈ స్టిల్ చూడండి.

టీజర్ లో ఇలియానాను అక్కడక్కడ చూపించారు. అలా చూపించిన 2-3 ఫ్రేమ్స్ లోనే ఇలియానా బొద్దుతనం బయటపడింది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన స్టిల్ లో కూడా ఇలియానా కాస్త లావుగానే కనిపించింది. సో.. మన కళ్లు మనల్ని మోసం చేయడం లేదన్నమాట. ఇలియానా నిజంగానే కాస్త కండపట్టింది.

గతేడాది ఆండ్రూను పెళ్లాడిన తర్వాత ఫిజిక్ పై ఫోకస్ తగ్గించినట్టుంది గోవాబ్యూటీ. పైగా బాలీవుడ్ లో అవకాశాలు కూడా తగ్గడంతో ఫ్యామిలీ లైఫ్ కు ఫిక్స్ అయినట్టుంది. అందుకే ఆమె కాస్త లావెక్కింది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో రవితేజ పిలిచి మరీ తెలుగు సినిమా ఛాన్స్ ఇవ్వడంతో, వదులుకోవడం ఎందుకని నటించింది.

ఇన్నాళ్లూ స్లిమ్ గా కనిపించి మెస్మరైజ్ చేసిన ఇలియానా, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కాస్త కొత్తగా కనిపించబోతోందన్నమాట. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 16న థియేటర్లలోకి వస్తోంది.