Advertisement


Home > Movies - Movie News
మళ్లీ ఆ రిస్క్ చేయలేను: ఇలియనానా

ఢిల్లీపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది గోవా బ్యూటీ ఇలియానా. ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్, రోడ్లు తనకు ఎంతో ఇష్టమంటోంది. అవకాశం దొరికితే ఢిల్లీ గల్లీల్లో చాట్ తినే ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోనంటోంది.

"నాకు ఢిల్లీలో బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. కేవలం షూటింగ్ పని మీద వచ్చి వెళ్తుంటాను. ఇక్కడి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని సార్లు ఎయిర్ పోర్ట్ కు వెళ్లే దారిలో మధ్యలో ఆగి చాట్ తినేదాన్ని. కానీ మళ్లీ ఆ రిస్క్ చేయలేను. అయితే ఈసారి ఎవరూ గుర్తుపట్టకుండా వెరైటీగా డ్రెస్ వేసుకొని, బయటకు వెళ్లి చాట్ తినాలని ఉంది."

కేవలం ఢిల్లీ వంటకాలు మాత్రమే కాదు, ఢిల్లీ రోడ్స్ కూడా తనకు ఎంతో ఇష్టమంటోంది ఇలియానా. ఢిల్లీలో కారు నడపడం తనకు చాలా ఇష్టమని, కానీ కేవలం రాత్రిళ్లు మాత్రమే ఆ పని చేస్తానని, ఎందుకంటే పగటి పూట ఢిల్లీలో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుందని అంటోంది. తన అప్ కమింగ్ బాలీవుడ్ మూవీ 'రైడ్' ప్రమోషన్ కోసం ఢిల్లీ వెళ్లిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాపై కూడా రియాక్ట్ అయింది. చాలామంది నెటిజన్స్ నారో-మైండ్ తో ఉంటారంటోంది.

"నా సోషల్ మీడియా ఎకౌంట్స్ లో నేను ఎక్కువగా రియాక్ట్ అవ్వను. ఎందుకంటే చాలామంది నాలా బోల్డ్ గా ఆలోచించరు. సంకుచితంగా ఆలోచిస్తుంటారు. అందుకే నేను సోషల్ మీడియాలో ఎక్కువగా రియాక్ట్ అవ్వను. బహుశా.. నా ఆలోచనలు కూడా ఎక్కువగా పాశ్చాత్య ధోరణిలో ఉంటాయనుకుంటా. అందుకే చాలామంది జనాల మైండ్ సెట్ తో నాకు వర్కవుట్ కాదు." సోషల్ మీడియా ఎకౌంట్స్ లో ఎందుకు పెద్దగా రియాక్ట్ అవ్వరనే ప్రశ్నకు ఇలా బోల్డ్ గా సమాధానమిచ్చింది ఇలియానా.