Advertisement

Advertisement


Home > Movies - Movie News

అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్న హీరోయిన్?

అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్న హీరోయిన్?

గోవా బ్యూటీ ఇలియానాపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి. మొన్నటివరకు ఆమె లవ్ లైఫ్, ప్రెగ్నెన్సీపై రూమర్స్ రాగా, తాజాగా ఆమె కెరీర్ కు సంబంధించి చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది.

రీసెంట్ గా ఓ బిడ్డకు ఇలియానా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందని కథనాలు వస్తున్నాయి. అయితే ఇలియానా టీమ్ మాత్రం ఆమె ఇప్పట్లో సినిమాల్లోకి రాదని, ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది.

మరోవైపు ఇలియానా, ఇండియా వదిలి వెళ్తుందనే ప్రచారం మొదలైంది. అమెరికాకు చెందిన మైఖేల్ డోలన్ ను ఇలియానా పెళ్లాడిన సంగతి తెలిసిందే. తను గర్భం దాల్చిన తర్వాత ఆ విషయాన్ని ఆమె బయటకు చెప్పింది. ఇప్పుడు అతడితో కలిసి అమెరికాలో సెటిల్ అవ్వాలని అనుకుంటోందంట ఇలియానా.

అమెరికాలో సెటిల్ అయ్యే ఉద్దేశంతోనే ఆమె మరే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. నిజానికి ఈపాటికి ఆమె ఓ వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలి. కానీ అది కూడా ఆమె పక్కనపెట్టినట్టు టాక్.

తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా కొన్ని మంచి సినిమాల్లో నటించింది. అయితే ఆమెకు హిందీలో స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఆ తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ కలిసిరాలేదు.

అలా కెరీర్ లో డౌన్ ఫాలో మొదలైన వెంటనే పెళ్లి, పిల్లలు అంటూ లైఫ్ లో సెటిలైపోయింది. ఇప్పుడు రీఎంట్రీ ఆలోచన లేకుండా ఏకంగా అమెరికాలో సెటిల్ అయ్యే అలోచనలో ఉందంట ఈ గోవా బ్యూటీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?