Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఐమాక్స్ పరువు తీసిన కలెక్షన్స్

ఐమాక్స్ పరువు తీసిన  కలెక్షన్స్

సినిమా అంటే సగటు జనం పడిచస్తారు. అందునా ఐమాక్స్ లోనే బొమ్మ చూడాలని ఆశపడతారు. ఇక ఫస్ట్ షో అంటే ఎంతటి డిమాండ్  ఉంటుందో తెలిసిందే. అడ్వాన్స్ గా ఆన్ లైన్లో  టికెట్లు తీసుకుంటారు. ఆ హాడావుడే వేరుగా.

ఇవన్నీ పక్కన పెడితే కరోనా మొత్తం అన్నీ చిద్రం చేసి పారేసింది. సామాన్యుడి వినోదమైన సినిమాను మాయగా మార్చేసింది. వెండితెరను ఇనుపతెరగా చేసేసింది. అన్ లాక్ సడలింపులలో భాగంగా సినిమా హాల్స్ తెరచుకోవచ్చు అని అనుమతులు ఇచ్చేశారు.

కాబోయే రాజధాని విశాఖలో సింగిల్ థియేటర్లు తెరచుకోలేకపోయినా ఐమాక్స్ లను ఓపెన్ చేశారు. ఫుల్ క్రౌడ్ ఉండే ఓ చోట ఐమాక్స్ ని తెరిస్తే వచ్చిన కలెక్షన్ ఎంతో తెలిస్తే సిగ్గు పడాల్సిందే. కేవలం 632 రూపాయలు వచ్చాయట. అంటే నలుగురు అంటే నలుగురు ప్రేక్షకులతో ఫస్ట్ షోని వేయాల్సివచ్చిందన్నమాట.

ఏ మూలకు ఈ డబ్బులు వస్తాయోనని ఐమాక్స్ నిర్వాహకులు తలలుపట్టుకుంటున్నారంటే సినిమా బొమ్మ తిరబడిందనేది బోధపడుతోందిగా. అంతా కరోనా మహిమ. జేబులో డబ్బులు తగ్గాయి. మనిషిలో హుషార్ లేదు. కరోనా భయం అంతకు మించి ఉంది. దాంతో సినిమా హాళ్ళు కళకళలాడేది ఎపుడన్నది ఆ దేవుడే చెప్పాలేమో.

ఈనాడు,జ్యోతి ప‌ట్టించుకోలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?