cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఏపీలో సాగుతున్న భారతీయుడు-2 షూటింగ్!

ఏపీలో సాగుతున్న భారతీయుడు-2 షూటింగ్!

భారతీయుడు సెకెండ్ పార్ట్ షూటింగ్ ఏపీలో వడివడిగా సాగుతూ ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. గత నాలుగైదు రోజులుగా ఈ సినిమా షూటింగ్ అక్కడ కొనసాగుతూ ఉంది. కీలక తారాగణం అంతా ఇందులో పాల్గొంటున్నట్టుగా సమాచారం. 

సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు  కమల్ హాసన్ కూడా సెంట్రల్ జైల్లో సన్నివేశాల చిత్రీకరణలో ఉన్నట్టుగా  తెలుస్తోంది. పట్టాలెక్కుతుందా లేదా అనే పలు అనుమానాలను  రేకెత్తించిన ఈ సినిమా ఎట్టకేలకూ షూటింగ్  దశ వరకూ వచ్చింది. తమిళంతో పాటు వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఇలా తెలుగునాట చిత్రీకరణ జరుపుకుంటోంది.

రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటించబోతోంది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ధ్రువీకరించింది. తన తదుపరి సినిమాల్లో ఇండియన్-2 కూడా ఉందని ఆమె తన ఫాటోయర్లకు ట్విటర్ ద్వారా తెలియజేసింది.