cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇండస్ట్రీ 'మెగా' మీటింగ్ రేపే

ఇండస్ట్రీ 'మెగా' మీటింగ్ రేపే

కరోనా కల్లోలం వచ్చి, సినిమా రంగాన్ని అతలాకుతలం చేసేసింది. లాక్ డౌన్ నిబంధనలు ఒక్కొక్కటిగా సడలుతున్నాయి. కానీ సినిమా రంగం పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. జూన్ నుంచి షూటింగ్ లకు అనుమతి లభిస్తుందా? సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి. ఒటిటిలతో పోటీ సంగతేమిటి? అసలు ప్రభుత్వం అనుమతి ఇచ్చేముందు లేదా ప్రభుత్వాన్ని అనుమతి కోరే ముందు సినిమా రంగం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ప్రశ్భలు ఎన్నో వున్నాయి.

వీటన్నింటికీ సమాధానం రాబట్టేందుకు, అసలు ఇండస్ట్రీ కరోనా విషయంలో ఏకతాటిపైకి వచ్చి, ఆపైన ప్రభుత్వాన్ని అనుమతులు కోరేందుకు వీలుగా ఓ మెగా మీటింగ్ ను ఏర్పాటు చేసారని తెలుస్తోంది. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటుచేస్తున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. 

ఇండస్ట్రీలోని హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా వీలయినంత వరకు అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు బోగట్టా. అయితే కరోనా నేపథ్యంలో సమావేశాలు జరపడానికి అవకాశం వుందా? అన్నది అనుమానం. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో ఓ సినిమా తీసి, నిర్మాత అని ఫిక్స్ అయిపోయిన వారిని కాకుండా, యాక్టివ్ గా సినిమాలు తీసేవారిని,  కీలకమైన దర్శకులు, హీరోలు చిరంజీవి సమావేశానికి ఆహ్వానించినట్లు బోగట్టా. 

జన్మనిచ్చిన గడ్డపైనే కక్ష

తెలంగాణా ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాం