cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇంతకీ నాగ్.. వర్జిన్ నా? కాదా?

పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ కు దిగుతానంటావేమిటి?

ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే పూలు పూస్తాయా?

నువ్వు.. వర్జిన్ వే కదా? ఇంకా వర్జిన్ వే కదా?

ఈ డైలాగులు చాలు మన్మధుడు 2 ఎలా వుండబోతోందో చెప్పడానికి. నాగ్ ఎవర్ గ్రీన్ హిట్ మన్మధుడు. దానికి సీక్వెల్ కాదు కానీ, కాస్త దాంతో కనెక్షన్ వున్నట్లు అనిపించే సినిమా మన్మధుడు 2. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. అందరి దృష్టిలో వయసు అయిపోయిన శ్రీరాముడిలా, వెనుక శ్రీకృష్ణుడిలా రెండు షేడ్స్ తో కనిపిస్తున్నాడు నాగార్జున.

వెన్నెల కిషోర్, సీనియర్ యాక్టర్ లక్ష్మి, రావురమేష్ లాంటివాళ్లు సపోర్ట్ గా వున్నారు. టీజర్ ను ఆద్యంతం ఫన్ ఓరియెంటెడ్ గా వుండేలా చూసారు. కాస్త లైట్ అడల్ట్ టచ్ ఇచ్చామా? లేదా? అన్నట్లు కోట్ చేసారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఈ టైపు కోట్ నే వర్కవుట్ అయింది. అందుకే మళ్లీ అదే ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది.

రాహుల్ రవీంద్రన్ కు ఇది డైరక్టర్ గా రెండో సినిమా. ఆగస్టులో విడుదలయ్యే సినిమా నాగ్ స్వంత బ్యానర్ మీద నిర్మాణమవుతోంది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం

 


×