Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇంట్రస్టింగ్...ప్లే బ్యాక్

ఇంట్రస్టింగ్...ప్లే బ్యాక్

థ్రిల్లర్ సినిమాల టీజర్లు, ట్రయిలర్లు ఎప్పుడూ ఇంటస్ట్రింగ్ గానే వుంటాయి. గతంలో విక్రమ్ కుమార్ లాంటి వాళ్లు కాలంతో వెనక్కు వళ్లడం, ముందుకు వెళ్లడం, సంఘటనలను ప్రభావితం చేయగలగడం లాంటి కాన్సెప్ట్ లను డీల్ చేసారు.

అలా కాకుండా ఒకేసారి పాస్ట్-ఫ్యూచర్ లను కలుపుతూ కథ అల్లి, ప్లే బ్యాక్ అనే సినిమా తీసారు. దాని ట్రయిలర్ విడుదల చేసారు.

క్రాస్ కనెక్షన్ అనే పేరుతో కొత్త కాన్సెప్ట్ అని చెప్పినా, జరిగేది ఒకటే ఈ జనరేషన్ లోని వారు ఆ జనరేషన్ లోని వారితో కాంట్రాక్ట్ లోకి రావడం, అప్పటి సంఘనలను ఇప్పటి వారు ప్రభావితం చేయడం, వీటి వెనుక మిస్టరీ ముడి ఎలా వీడింది అన్నదే. అదే పాయింట్ ను కాస్త ఇంట్రస్ట్ గా డీల్ చేసినట్ల కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. 

దినేష్ తేజ్, అర్జున్ కళ్యాణ్, స్పందన, అనన్య నాగళ్ల తదితరులు నటించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం హరిప్రసాద్ జక్కా. నిర్మాత ప్రసాదరావు పెద్దినేని. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?