Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామ్ చరణ్ ఫస్ట్ లుక్ బాగుంది కానీ..!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్ బాగుంది కానీ..!

శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పై ఓ మోస్తరుగా విమర్శలు చెలరేగాయి. ఇదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందని కొంతమంది, మాస్ అప్పీల్ లేదని మరికొంతమంది కామెంట్లు పెట్టారు.

ఓవైపు ఈ విమర్శలు ఇలా కొనసాగుతున్న టైమ్ లోనే, ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఆ ఫస్ట్ లుక్ కూడా బాగుంది కానీ, అడపాదడపా విమర్శలు తప్పలేదు. ఫస్ట్ లుక్ లో చరణ్ హెయిర్ స్టయిల్, గతంలో అతడు నటించిన బ్రూస్ లీ సినిమా టైపులోనే ఉందని కొందరన్నారు. మరికొందరు, రీసెంట్ గా వచ్చిన వారసుడు లుక్ తో గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ ను పోల్చారు. అక్కడ విజయ్, ఇక్కడ చరణ్, ఇద్దరూ బైక్ పై కూర్చొని వెనక్కి తిరిగి పోజులిచ్చారు.

శంకర్ స్థాయి ఫస్ట్ లుక్ అనిపించుకుందా?

ఈ ఫస్ట్ లుక్ పై ఇప్పటివరకు చరణ్ కోణంలోనే చిన్నచిన్న విమర్శలు, కామెంట్స్ వచ్చాయి. మరి శంకర్ పరిస్థితేంటి? విలక్షణ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న ఈ డైరక్టర్ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లుక్, అతడి స్థాయిలో ఉందా? సరిగ్గా ఇక్కడే తమిళ, బాలీవుడ్ మీడియాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.

శంకర్ సినిమాలకు ఓ స్థాయి ఉంది. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలు, వాటి నుంచి రిలీజైన ఫస్ట్ లుక్స్ అన్నీ పాన్ ఇండియా లెవెల్లో హిట్టయ్యాయి. ఉదాహరణకు రోబో, 2.O సినిమాల్నే తీసుకుంటే.. వాటి ఫస్ట్ లుక్స్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక విక్రమ్ తో తీసిన ఐ-మనోహరుడు ఫస్ట్ లుక్ అయితే ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి.

చివరికి కమల్ హాసన్ తో తీస్తున్న ఇండియన్-2 ఫస్ట్ లుక్ కూడా శంకర్ స్థాయిలోనే ఉంది. అతడి మార్కు స్పష్టంగా కనిపించింది. కానీ గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ లో మాత్రం శంకర్ కనిపించలేదు. చరణ్ మాత్రమే కనిపించాడు.

ఇలా చెప్పుకుంటూపోతే శంకర్ సినిమాలకు సంబంధించి గతంలో రిలీజైన ఫస్ట్ లుక్స్ అన్నీ ఎంతో ఆకర్షించాయి. అదే టైమ్ లో సినిమాపై ఉత్సుకత రేకెత్తించాయి. కానీ గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ విషయంలో ఆ ఉత్సుకత, కొత్తదనం కనిపించలేదు. ఇదేదో పక్కా యాక్షన్-కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్ ఇచ్చింది తప్ప, శంకర్ మార్క్ కనిపించలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?