ఆ మధ్య బాలకృష్ణ గుండులో కనపడగానే.. అందకూ అరే భలే కొత్తగా ఉందే గెటప్ అనుకున్నారు. నున్నగా గుండు గీయించుకుని, మీసాలు మాత్రం పెంచేసి రంగు వేసుకుని కనిపించారు. ఏదైనా మొక్కు తీర్చుకున్నారేమో అనే సందేహం కూడా కొంతమందికి వచ్చింది. అయితే హిందూపురం పర్యటన తర్వాత మాత్రం ఒకటి క్లారిటీ వచ్చింది. బాలయ్య హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారేమో అనిపిస్తోంది. గుండు గీయించుకున్న తర్వాత ఆయనకు ఫుల్ గా జుట్టు వస్తోంది. నున్నగా ఉన్న బాలయ్య గుండుపై పూర్తిస్థాయిలో జుట్టు పెరుగుతోందిప్పుడు. బట్టతల దాదాపు మాయమై మంచి రెట్రో లుక్ లో కనిపిస్తున్నాడు బాలయ్య.
ఇప్పటివరకూ విగ్గులతో మెయింటెన్ చేసిన బాలయ్యకు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం ఏమొచ్చింది. ఇంత లేటు వయసులో ఆయనకు ఈ సాహసం అవసరమా అని కొంతమంది ఆశ్చర్యపోయారు. అయితే మొత్తానికి బాలకృష్ణ ట్రాన్స్ ప్లాంటేషన్ వైపు మొగ్గు చూపి పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. తన సహనటులు చిరంజీవి, వెంకటేష్ వేయని డేరింగ్ స్టెప్ వేసేశారు.
కేవలం షూటింగ్స్ టైమ్ లో మాత్రమే విగ్గులు పెట్టి, రియల్ లైఫ్ లో నేచురల్ గా ఉండటం రజనీకాంత్ లాంటి వారికి మాత్రమే చెల్లింది. అలాంటి సాహసం మిగతావాళ్లు చేయలేరు. అందుకే బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చినా, రాజకీయ పర్యటనలకు వెళ్లినా విగ్గు కంపల్సరీ. అయితే ఆ మధ్య రూలర్ సినిమా కోసం మాత్రం ఆయన పడరాని పాట్లు పడ్డారు. అడ్డమైన విగ్గులు వాడారు.
ఆ ఐడియా దర్శకుడిదో లేక, ఆయన హెయిర్ స్టైలిస్ట్ దో తెలియదు కానీ, కెరీర్ లో అతి ఛండాలమైన విగ్గులు మాత్రం ఆ సినిమాలోనే వాడారు బాలకృష్ణ. విపరీతమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఇక విగ్గుల జోలికి వెళ్లకుండా ట్రాన్స్ ప్లాంటేషన్ వైపు మళ్లినట్టున్నారు బాలయ్య. ఇకపై విగ్గులు పక్కనపెట్టి జుట్టుకు రంగేసుకుంటే సరిపోతుందేమో.