cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

క‌ష్ట‌మే..త‌ప్ప‌డం లేదుః సీనియ‌ర్ యాంక‌ర్‌

క‌ష్ట‌మే..త‌ప్ప‌డం లేదుః సీనియ‌ర్ యాంక‌ర్‌

క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాల్సిన ప‌రిస్థితి. అంతా నా ఇష్టం. నాకు న‌చ్చిన‌ట్టు ఉంటానంటే ...క‌రోనా ఊరుకోదు. క‌నిపించ‌ని ఆ మ‌హమ్మారి పంజా విసిరితే ...గిల‌గిల‌లాడాల్సిందే. దీంతో క‌రోనా అంటే భ‌య‌భ‌క్తుల‌తో మ‌స‌లు కోవాల్సిన ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో వేడుక‌ల‌కు ప‌రిమిత సంఖ్య‌లోనే హాజ‌రు కావాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా వివాహాది ముఖ్య‌మైన వేడుక‌ల‌కు కూడా కుటుంబ స‌భ్యులతో పాటు ఐదారుగురికి మించి క‌ల‌వ‌లేని ప‌రిస్థితి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే శుభ‌మైనా, అశుభ‌మైనా వీక్షించాల్సి వ‌స్తోంది. 

వ‌రుస‌కు కొడుక‌య్యే ఓ యువ‌కుడి నిశ్చితార్థం మిగిల్చిన అనుభ‌వం గురించి సీనియ‌ర్ యాంక‌ర్‌, న‌టి ఝాన్సీ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు.

ఈ మేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ వివ‌రాలేంటో ఆమె మాట‌ల్లోనే తెలుసుకుందాం.

"ఎన్నో కారణాల వల్ల కోవిడ్‌ను ద్వేషిస్తున్నాం. నేనైతే ఈ వేడుకకు హాజరు కాలేకపోయినందుకు ఆ వైరస్‌ను తిట్టుకుంటున్నాను. పుత్రసమానుడైన సంపత్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దాన్ని నేను ఆన్‌లైన్‌లో వీక్షించాను. ఈ నిశ్చితార్థ వేడుక కేవలం ఇరు కుటుంబ సభ్యులు మధ్య మాత్రమే జరిగింది.  

ప్రపంచవ్యాప్తంగా నాతో సహా 300 మంది ఈ ఎంగేజ్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఇది కొత్తదే అయినా నేర్చుకుంటున్నాం. కొంత కష్టమే కానీ తప్పడం లేదు" అని ఝాన్సీ చెప్పుకొచ్చారు. ఇది ఒక్క ఝాన్సీ అనుభ‌వ‌మే కాదు, చాలా మందిది అని చెప్పొచ్చు. భ‌విష్య‌త్‌లో ఇలాంటి మార్పులు మ‌రెన్ని చూడాల్సి వ‌స్తుందో అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×