Advertisement

Advertisement


Home > Movies - Movie News

జబర్దస్త్‌ వినోద్ ఇంటి గొడ‌వ‌

జబర్దస్త్‌ వినోద్ ఇంటి గొడ‌వ‌

జబర్దస్త్‌ వినోద్ ఇంటి గొడ‌వ వీధికెక్కింది. ఇంటి కొనుగోలు విష‌యంలో య‌జ‌మానితో ఏర్ప‌డిన వివాదం తెలుగు సీరియ‌ల్ మాదిరిగా కొన‌సాగుతూనే ఉంది. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌లతో అలరించే వినోద్ అలియాస్ వినోదిని వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం ట్రాజెడీ తీవ్ర మాన‌సిక వేద‌న క‌లిగిస్తోంది.

తాజాగా ఆయ‌న న్యాయం చేయాల‌ని కోరుతూ ఈస్ట్ జోన్ డీసీపీ ర‌మేష్‌రెడ్డిని క‌లిసి విన్న‌వించాడు. ప్ర‌స్తుతం తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్ర‌యిస్తాన‌ని సంబంధిత య‌జ‌మాని రూ.40 ల‌క్ష‌ల‌కు ఒప్పందం చేసుకున్నార‌న్నాడు. 

ఏడాది క్రితం రూ.13.40 ల‌క్ష‌లు అడ్వాన్స్ కూడా య‌జ‌మానికి ఇచ్చిన‌ట్టు విన‌తిప‌త్రంలో పేర్కొన్నాడు. ఇప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకున్న రూ.40 ల‌క్ష‌ల కంటే ఎక్కువ మొత్తం ఇస్తేనే ఇల్లు అమ్ముతాన‌ని మొండికేశార‌ని వినోద్ వాపోయాడు. ఒక‌వేళ ఎక్కువ మొత్తం ఇవ్వ‌క‌పోతే అడ్వాన్స్ సొమ్ము కూడా ఇచ్చేది లేద‌ని బెదిరిస్తున్న‌ట్టు అత‌ను చెప్పుకొచ్చాడు.

గ‌తంలో త‌న‌పై ఇదే విష‌య‌మై ఇంటి య‌జ‌మాని దాడి చేసిన విష‌యాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లాడు. హైద‌రాబాద్‌లోని కుత్బిగూడ‌లో అద్దె ఇంటిని వినోద్ రూ.40 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసిన నేప‌థ్యంలో య‌జ‌మానితో గొడ‌వ ఏర్ప‌డింది. 

ఈ నేప‌థ్యంలో 2019 జూలైలో అత‌నిపై దాడి జ‌రిగింది. అప్పట్లో కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేద‌ని, త‌న‌కు న్యాయం చేయాల‌ని డీసీపీకి అందజేసిన వినతిపత్రంలో వినోద్ కోరాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?