జేపీ రిటైర్మెంట్ ఇచ్చారు.. అనీల్ వెనక్కి తీసుకొచ్చాడు

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా.. ఇలా వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలేకుండా అంతా జయప్రకాష్ రెడ్డినే కోరుకునేవారు. ఇలా కెరీర్ పరంగా బిజీగా…

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా.. ఇలా వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలేకుండా అంతా జయప్రకాష్ రెడ్డినే కోరుకునేవారు. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న టైమ్ లోనే సినిమాల నుంటి రిటైర్ అయ్యారు జయప్రకాష్ రెడ్డి. ఆల్రెడీ ఒప్పుకున్న ఓ చిన్న సినిమా పూర్తిచేసి, గతేడాదే ఆయన గుంటూరు వెళ్లిపోయారు.

గతేడాది ఏప్రిల్ లో ఆయన హైదరాబాద్ ను వదిలేసి గుంటూరు వెళ్లిపోయారు. జయప్రకాష్ రెడ్డి తనయుడు గుంటూరులో సెటిల్ అయ్యారు. ఇక జేపీ కుమార్తె విజయవాడలో సెటిల్ అయ్యారు. ఆయన అల్లుడు బెజవాడలోనే అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇలా కొడుకు-కూతురు ఇద్దరూ గుంటూరు-బెజవాడలో సెటిల్ అవ్వడంతో జేపీ హైదరాబాద్ ను వీడివెళ్లారు. టాలీవుడ్ కు ఏడాది కిందటే గుడ్ బై చెప్పేశారు.

జేపీ ఇక సినిమాలు చేయరు, ఆయన రిటైర్ అయ్యే విషయం ఇండస్ట్రీలో అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. సరిలేరు నీకెవ్వరు సినిమా తీస్తున్న టైమ్ లో దర్శకుడు అనీల్ రావిపూడికి ఈ విషయం తెలిసింది. అయితే అందరిలా అనీల్ ఊరుకోలేదు. జేపీని ఆప్యాయంగా గురువుగారు అని పిలుచుకునే అనీల్.. బలవంతంగా ఒప్పించి ఆయన్ను మరోసారి హైదరాబాద్ రప్పించాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో జయప్రకాష్ రెడ్డికి రెండే డైలాగులు. ఫస్టాఫ్ అంతా పండబెట్టి-పీక కోసి అనే డైలాగ్ మాత్రమే ఉంటుంది. ఇక సెకెండాఫ్ అంతా కూజాలు చెంబులౌతాయి అనే డైలాగ్ మాత్రమే ఉంటుంది. ఈ రెండు డైలాగ్స్, ఆ సీన్స్ సినిమాలో ఎంత బాగా పేలాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలా అనీల్ రావిపూడి బలవంతం పెట్టడంతో మరోసారి హైదరాబాద్ వచ్చిన జయప్రకాష్ రెడ్డి.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి తిరిగి గుంటూరు వెళ్లిపోయారు. ఇప్పుడు ఏకంగా ఈ లోకాన్నే వీడి వెళ్లిపోయారు. 

ప్రభాస్ 2 కోట్ల విరాళం