Advertisement

Advertisement


Home > Movies - Movie News

బిగ్‌బాస్ హౌస్ నుంచి హారిక ఔట్ ...బ‌ట్‌!

బిగ్‌బాస్ హౌస్ నుంచి హారిక ఔట్ ...బ‌ట్‌!

బిగ్‌బాస్ రియాల్టీ షో నిన్న‌గాక మొన్న స్టార్ట్ అయిన‌ట్టుందే కానీ, అప్పుడే రెండో వారం ఎలిమినేష‌న్‌కు వ‌చ్చేశాం. బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌లో రెండో ఎలిమినేష‌న్ కింద క‌రాటే క‌ల్యాణి బ‌య‌టికి వ‌చ్చారు. క‌ల్యాణి చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వ‌మే ప్రేక్ష‌కుల నిరాద‌ర‌ణ‌కు గురైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే త‌న ఎలిమినేష‌న్ గురించి క‌ల్యాణి నేడు స్టేజ్‌పై ఏం చెబుతుందోన‌నే ఆస‌క్తి నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా ఈ వారం రెండు ఎలిమినేష‌న్లు ఉంటాయ‌ని హోస్ట్ నాగార్జున ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. క‌ల్యాణి త‌ర్వాత త‌క్కువ ఓట్లు సంపాదించుకున్న‌దెవ‌ర‌నే ఆరాలు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో మూడో ఎలిమినేష‌న్ కింద బ‌య‌ట‌కు వ‌స్తున్న కంటెస్టెంట్‌పై సోష‌ల్  మీడియాలో విస్తృత చ‌ర్చ సాగుతోంది. దేత్త‌డి హారిక ఎలిమినేట్ కానున్న‌ట్టు స‌మాచారం. అయితే బిగ్‌బాస్ ఇక్క‌డో ట్విస్ట్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

హారిక‌ను బ‌య‌ట‌కు పంపిన‌ట్టే పంపి ... తిరిగి ఓ సీక్రెట్ రూంలోకి పంప‌నున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త సీజ‌న్‌లో కూడా ఇలాగే రాహుల్ సిప్లిగంజ్‌ ఎలిమినేట్ అయిన‌ట్టు ప్ర‌క‌టించి .... తిరిగి లోప‌లికి పంప‌డాన్ని చూశాం. ఆ త‌ర్వాత అత‌నే బిగ్‌బాస్ సీజ‌న్ -3 విజేత‌గా నిలిచాడు.

రెండో సీజ‌న్‌లో అయితే నూత‌న్‌నా యుడు, యాంక‌ర్ శ్యామ‌ల ఎలిమినేట్ అయిన త‌ర్వాత తిరిగి ఓటింగ్ చేప‌ట్టి వాళ్లిద్ద‌రిని లోప‌లికి పంపిన విష‌యం తెలిసిందే. అలాంటి ట్విస్టే ఇప్పుడు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. చూద్దాం మ‌రికొన్ని గంట‌ల్లో ఏం జ‌రుగుతుందో. తిన‌బోతు రుచి చూడ‌డం ఎందుకు?

ఈవిషయం బాబు&కో ఎప్పుడు గమనిస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?