Advertisement


Home > Movies - Movie News
జ్యోతిక చాలా అప్‌డేట్‌ అవ్వాలేమో

హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో మంచి చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు అందుకున్న జ్యోతిక, తమిళ హీరో సూర్యని పెళ్ళాడాక సినిమాల్లో నటించడం తగ్గించేసింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతోన్న జ్యోతిక, సినీ పరిశ్రమలో ట్రెండ్‌ని అర్థం చేసుకోవడంలో కాస్తంత వెనుకబడ్డట్టుంది. 

హీరోలకి వున్న మార్కెట్‌తో పోల్చితే, హీరోయిన్లకి మార్కెట్‌ చాలా తక్కువని సెలవిచ్చింది జ్యోతిక. ఇది చాలా వరకు నిజమే అయినా, ట్రెండ్‌ ఇప్పుడు బాగా మారింది. బాలీవుడ్‌లో తీసుకుంటే కంగనా రనౌత్‌ సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటోంది. ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనే.. ఇలా చాలామంది హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ మీద ఫోకస్‌ ఎక్కువడంతో సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడ్తున్నారు. సౌత్‌లోనూ అడపా దడపా ఆ తరహా సినిమాలు వస్తున్నాయి. 

అన్నట్టు, తన తాజా సినిమా 'మగళిర్‌ మట్టుం' (ఆడవాళ్ళకు మాత్రమే) సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న జ్యోతిక, ఈ సినిమా విజయంపై ముందే చేతులెత్తేసినట్లు మాట్లాడుతుండడం గమనార్హం. 'ఈ పురుషాధిక్య సినీ రంగంలో ఇలాంటి సినిమాలు ఆడటం కష్టమే..' అని వాపోయింది జ్యోతిక. అయితే 'ఆడవాళ్ళకు మాత్రమే' సినిమా (పాతది) అప్పట్లో పెద్ద విజయాన్నే అందుకుంది. 

సినిమాలో సత్తా వుండాలేగానీ, లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో ఎన్ని ఆడలేదు.? చిన్న సినిమాలూ, పెద్ద సినిమాలన్న తేడాల్లేవ్‌.. ఈ మధ్య, అస్సలేమాత్రం పబ్లిసిటీ లేకుండా విడుదలై సంచలన విజయాల్ని అందుకుంటున్నాయి కొన్ని సినిమాలు. 4 కోట్లతో తెరకెక్కిన, 40 కోట్ల వసూళ్ళు సాధించిన సినిమాల్ని చూస్తున్నాం. ప్చ్‌, జ్యోతిక చాలా అప్‌డేట్‌ అవ్వాల్సి వుంది.