
గోపీచంద్ తో సంపత్ నంది చేస్తున్న మలి ప్రయత్నం సీటీమార్. కబడ్డె క్రీడ నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం. సీటీమార్ సినిమా షూట్ దాదాపు పూర్తయింది. ఏపిల్ 2 ను విడుదల తేదీగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజర్ విడుదల చేసారు.
కేవలం ఏదో స్పోర్ట్స్ డ్రామా అన్నట్లు కాకుండా అవుట్ అండ్ అవుట్ భారీ యాక్షన్ సినిమా మాదిరిగా టీజర్ ను కట్ చేసారు. భారీ యాక్షన్ సీన్లు, పక్కా కమర్షియల్ కథ సినిమాలో వున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
విలన్ ను చూపించకుండానే, సినిమా విలనిజం ఏ రేంజ్ లో వుందీ అన్నది చెప్పే ప్రయత్నం చేసారు. కబడ్డీ మైదానంలో ఆడితే ఆట..బయట ఆడితే వేట అనే పంచ్ డైలాగ్ ను గోపీచంద్ తో చెప్పించారు.
సినిమాలో వున్న స్టార్ కాస్ట్ మొత్తాన్ని టీజర్ లోకి తీసుకురావడం ద్వారా సినిమా భారీతనాన్ని మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు నిర్మాత చిట్టూరి శ్రీను.