cloudfront

Advertisement


Home > Movies - Movie News

కబీర్ సింగ్ ట్రైలర్: అచ్చంగా అర్జున్ రెడ్డి!

'అర్జున్ రెడ్డి' బాలీవుడ్ ట్రైలర్ దాదాపుగా అర్జున్ రెడ్డిలానే ఉంది. కేవలం నటీనటులు మాత్రమే వేరు తప్ప.. తెలుగు వెర్షన్ కు కార్బన్ కాపీలా ఉంటుంది హిందీ వెర్షన్ అనే భావనను కలిగిస్తోంది 'కబీర్ సింగ్' ట్రైలర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కూడా యథాతథంగానే వాడేశారని స్పష్టం అవుతోంది.

తెలుగు వెర్షన్ లోలా ఎమెషన్స్ కూడా యథాతథంగా పలికినట్టుగా ఉండటం హిందీ వెర్షన్ కు ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ దేవరకొండలా ఒడ్డూ పొడుగు ఉన్న హీరో కాదు కానీ.. షాహిద్ కపూర్ కూడా అర్జున్ రెడ్డి పాత్రకు చక్కగానే సెట్ అయ్యాడు. ఇక నటిగా ప్రతిభావంతురాలు కియరా అద్వానీ. 

వీరి కాంబోలో 'అర్జున్ రెడ్డి' రూపకర్త సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను హిందీలో రూపొందించాడు. కల్ట్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం అంటే కత్తి మీద సామే. ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. అదెలా ఉంటోందో.. ఇది వరకూ కొన్ని సూపర్ హిట్ సినిమాల రీమేక్ లు చూపించాయి.

అర్జున్ రెడ్డి రీమేక్ కు మాత్రం అలాంటి భయం ఏమీ లేనట్టుగా ఉంది. బహుశా ఒరిజినల్ వెర్షన్ ను రూపొందించిన దర్శకుడే హిందీ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తుండటంతో.. రీ టెల్లింగ్ లో కూడా ఎమోషన్స్ క్యారీ అయ్యే అవకాశాలున్నాయి. ఆ భరోసానే ఇస్తోంది ట్రైలర్

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ.