Advertisement

Advertisement


Home > Movies - Movie News

అలాంటి వాడిని పెళ్లి చేసుకోనన్న కాజల్!

అలాంటి వాడిని పెళ్లి చేసుకోనన్న కాజల్!

తమకన్నా వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ నుంచి దక్షిణాది చిత్ర పరిశ్రమల వరకూ అలాంటి వారు చాలా మందే కనిపిస్తారు. తమ కన్నా వయసులో చాలా చాలా చిన్నవాడితో కూడా కొంతమంది నటీమణులు కలిసి తిరుగుతున్నారు. కొందరు పెళ్లి కూడా చేసుకున్నారు.

ప్రియాంక చోప్రా తన కన్నా చాలా చిన్నవాడిని చేసుకుంది. అలాగే బాలీవుడ్ లో సాగుతున్న అర్జున్ కపూర్- మలైకా అరోరా ల వ్యవహారం సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మరింతమంది ఉన్నారు. అయితే అలాంటి జాబితాలో తను చేరదలుచుకోలేదని స్పష్టం చేసింది కాజల్ అగర్వాల్.

తను తన కన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకునేది లేదని కాజల్ స్పష్టం చేసింది. తన ఫాలోయర్లతో జరిపిన చిట్ చాట్ లో ఒక కుర్రాడు కాజల్ కు ప్రేమ ప్రతిపాదన చేశాడు. తన వయసు పదిహేడేళ్లని, తెలుగు వాడని అంటూ.. కాజల్ కు తెలుగు రాకపోయినా తను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ అతడు ప్రతిపాదించాడు.

ఆ ప్రతిపాదనకు కాజల్ సమాధానం ఇచ్చింది. వయసులో తన కన్నా చిన్నవాడిని తను పెళ్లి చేసుకోనంటూ కాజల్ ఆ ప్రేమప్రతిపాదనకు నో చెప్పింది. ఇక పెళ్లెప్పుడు.. అని అడిగన మరో ఫాలోయర్ కు స్పందిస్తూ.. తనకు వివాహబంధంపై ఆసక్తి ఉందని, అన్ని కుదిరినప్పుడు పెళ్లి గ్యారెంటీగా చేసుకుంటానంటూ కాజల్ ప్రకటించింది.

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?