cloudfront

Advertisement


Home > Movies - Movie News

తీవ్రంగా జబ్బుపడిన కాజల్..!

తీవ్రంగా జబ్బుపడిన కాజల్..!

కాజల్ నుంచి మినిమం గ్యాప్ లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులో కాకపోతే తమిళ్ లో ఆమె నటిస్తూనే ఉంది. ఆమె పెళ్లిపై పుకార్లే తప్ప, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి గాసిప్స్ లేవు. కానీ తనకున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యను కాజల్ బయటపెట్టింది.

"ఈ ఏడాది ప్రారంభంలో బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. బాగా రిలాక్స్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే దురదృష్టవశాత్తూ నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. 3 నెలలు అస్సలు లేవలేకపోయాను. పూర్తిగా మంచానికే పరిమితమైపోయాను. ఆ టైమ్ లో నాకు అస్సలు బాగాలేదు. చాలామందికి ఈ విషయం తెలీదు."

ఇలా తనుకున్న ఆరోగ్య సమస్యను బయపెట్టింది కాజల్. ఆ టైమ్ లో ముంబయిలో ఉన్నానని, సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకున్నానని, కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాల వల్ల ఎక్కువగా రెస్ట్ తీసుకోలేకపోయానని చెప్పుకొచ్చింది.

"ఆటో-ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడ్డాను. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను. కానీ నేను కాస్త స్పీడ్ తగ్గించాలి. నేను బ్రేక్ తీసుకోవాలని దేవుడే ఇలా చేశాడేమో. ఇక నేను చేసేదేం లేదు. సినిమాలు తగ్గించాల్సిందే."

హఠాత్తుగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి, ఊహించని విధంగా జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చేయడం ఈ రోగ లక్షణం. తనకు ఈ సమస్య ఉందనే విషయం ప్రారంభంలో తెలియలేదని, కానీ ప్రతిరోజు జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకున్నానని తెలిపింది కాజల్.

"ఈ జబ్బు ఉందనే విషయం నాకు తెలీదు. రోజూ షూటింగ్స్ కు వెళ్లేదాన్ని. చాలా బిజీగా ఉండేది లైఫ్. కానీ ప్రతి రోజు రాత్రి జ్వరం వచ్చేది. తీవ్రమైన అలసట ఉండేది. అలా ఎందుకు వచ్చేదో, ఆ బాధ ఎలా ఉండేదో నేను మాటల్లో వివరించలేను. ఎందుకు ఈ రోగం వచ్చిందో తెలీదు. డాక్టర్ల పర్యవేక్షణలో హెవీ డోస్ మందులు తీసుకున్నాను."

మొత్తానికి తన ఆరోగ్య సమస్య నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని అంటోంది కాజల్. అందుకే ఆహారం, వ్యాయామం విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని తెలిపింది. ఏదేమైనా ఇకపై సినిమాలు తగ్గించడం ఖాయమని మాత్రం స్పష్టంచేసింది. 

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్