cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఈగను ఫాలో అవుతున్న విజేత

ఈగను ఫాలో అవుతున్న విజేత

నాని హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ఈగ. మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా విజేత. ఈ రెండు సినిమాలకు కథా పరంగా, కాస్టింగ్ పరంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈగను ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నాడు విజేత. దీనివెనక ఇంట్రెస్టింగ్ స్టోరీతో పాటు ఓ పెద్ద సెంటిమెంట్ కూడా ఉంది.

వారాహి చలనచిత్ర బ్యానర్ పై తెరకెక్కింది ఈగ సినిమా. నిర్మాత సాయి కొర్రపాటి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అది. అందుకే ఆ మేజిక్ ను మళ్లీ రిపీట్ చేయాలనే కోరికతో, సెంటిమెంట్ కొద్దీ ఈగ విడుదలైన రోజునే విజేతను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. అలా ఈగ రిలీజ్ డేట్ ను విజేత లాక్ చేశాడన్నమాట.

2012, జులై 6న విడుదలైంది ఈగ సినిమా. అదే జులై 6వ తేదీన విజేత సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. విజేత సినిమాకు సంబంధించి రీసెంట్ గా టీజర్ విడుదలైంది. త్వరలోనే ఈ సినిమా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు.

మెగా కాంపౌండ్ కు చెందిన హీరోలంతా విజేతకు భారీ స్థాయిలో ప్రచారం కల్పించబోతున్నారు. చిరంజీవి నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇలా మెగా హీరోలంతా కల్యాణ్ దేవ్ ను హీరోగా నిలబెట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేయబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి పవన్ కల్యాణ్ మాత్రం కాస్త దూరంగా ఉండబోతున్నాడని టాక్.