cloudfront

Advertisement


Home > Movies - Movie News

కళ్యాణ్‌రామ్‌ 'షేర్‌' సెన్సార్‌ పూర్తి

కళ్యాణ్‌రామ్‌ 'షేర్‌' సెన్సార్‌ పూర్తి

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అతి త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కొమర వెంకటేష్‌. 

ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్‌ సభ్యులు మంచి సినిమా తీశారని అభినందించారు. కళ్యాణ్‌రామ్‌గారికి పటాస్‌ తర్వాత షేర్‌ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. బిజినెస్‌పరంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ మల్లికార్జున్‌ టేకింగ్‌ చాలా అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలోనే మా 'షేర్‌' చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తాం'' అన్నారు. 

నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.