Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇటు కమల్ హాసన్.. అటు ఉపేంద్ర

ఇటు కమల్ హాసన్.. అటు ఉపేంద్ర

కమల్ హాసన్ హాస్పిటల్ లో చేరిన మాట వాస్తవం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఓ సెక్షన్ మీడియా హోరెత్తిస్తోంది. అటు ఉపేంద్ర కూడా అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నారంటూ కథనాలు వస్తున్నాయి. వాస్తవం ఏంటంటే.. వీళ్లు ఇద్దరూ సేఫ్ గానే ఉన్నారు.

నిన్న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు కమల్ హాసన్. ఆయన కొద్దిపాటి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అంతకుమించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని శ్రీరామచంద్ర హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన హాస్పిటల్ వర్గాలు, ఒకటి లేదా రెండ్రోజుల్లో కమల్ ను డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు.

అటు ఉపేంద్ర కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. తను అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తల్ని ఈ నటుడు స్వయంగా ఖండించాడు. అంతేకాదు, తను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఓ సెల్ఫీ వీడియో కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఓ స్టుడియోలో తను షూటింగ్ లో ఉన్నానని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

షూటింగ్ లో స్మోక్, డస్ట్ వల్ల కొంచెం జలుబు, దగ్గు ఉన్నప్పటికీ అది అస్వస్థత కాదని ఉపేంద్ర స్పష్టం చేశారు. తను అనారోగ్యానికి గురయ్యానంటూ వస్తున్న వార్తల్ని నమ్మొద్దని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?