cloudfront

Advertisement


Home > Movies - Movie News

రజనీతో చేతులు కలుపుతా.. కానీ?

రజనీతో చేతులు కలుపుతా.. కానీ?

కోలీవుడ్ కు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరి పార్టీల్ని వాళ్లు స్థాపించే ప్రాసెస్ లో బిజీ అయిపోయారు. ఇప్పటివరకు తమ పార్టీ పేర్లను కూడా వీళ్లు ప్రకటించలేదు. కానీ వీళ్లు స్థాపించబోయే పార్టీలకు సంబంధించి వాడివేడిగా తమిళనాట చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు బడాస్టార్లు రాజకీయంగా చేతులు కలుపుతారా అనే చర్చ తమిళ టీవీ ఛానెల్స్ లో ప్రముఖంగా కనిపిస్తోంది. 

ఈ విషయంపై ఇప్పటికే రజనీకాంత్ స్పందించాడు. ఏదీ సూటిగా చెప్పని రజనీకాంత్.. కమల్ హాసన్ తో పొత్తుపై కూడా అలానే స్పందించాడు. తమ మధ్య రాజకీయ పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని దాటేశాడు. గతంలో రజనీ ఈ ప్రకటన చేసిన టైమ్ లో అదే వేదికపై కమల్ కూడా ఉన్నాడు. 

అయితే రజనీకాంత్ తో పొత్తుపై కమల్ మాత్రం ఇలాంటి డొంకతిరుగుడు ప్రకటనలు చేయలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే కమల్ హాసన్.. రజనీకాంత్ తో చేతులు కలిపే విషయంపై కూడా అంతేసూటిగా మాట్లాడాడు. 

"ప్రస్తుతం రజనీకాంత్ పెట్టబోయే పార్టీలో, అతడి రాజకీయాల్లో కాషాయం ఎక్కువగా కనిపిస్తోంది. తమది ఆధ్యాత్మిక పార్టీ అంటున్నాడు. ఆ ధోరణి మారాలి. అప్పటివరకు రజనీతో పొత్తు ఉండదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కానీ రాజకీయాలు వేరు." ఇలా పొత్తుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేశాడు కమల్. కేంబ్రిడ్జ్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ చర్చాగోష్టిలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.