cloudfront

Advertisement


Home > Movies - Movie News

'కణం' రిలీజ్: ఈసారి మరో తేదీ!

'కణం' రిలీజ్: ఈసారి మరో తేదీ!

ఇప్పటికే పలుమార్లు వాయిదాపడింది కణం సినిమా. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఈ సినిమా విడుదల 3సార్లు వాయిదాపడింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో డేట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 27న కణం సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి 2కారణాలు. వీటిలో ఒకటి కోలీవుడ్ లో సమ్మె విరమించడం. ఇక రెండోది టాలీవుడ్ లో గ్యాప్ దొరకడం. అవును.. ఈ రెండూ కణం సినిమాకు కలిసొచ్చాయి. బంద్ ఎత్తేశారు కాబట్టి కోలీవుడ్ లో ఈ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.

ఇక కాలా సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవ్వడం కూడా ఈ మూవీకి కలిసొచ్చింది. అందుకే ఏప్రిల్ 27న హుటాహుటి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో అవాంతరాలు ఎదురైతే తప్ప, 27కు ఈ సినిమా రావడం దాదాపు ఖాయం.

విడుదల తేదీ అయితే ఫిక్స్ అయింది కానీ ప్రచారంతోనే చిక్కంతా వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా టైమ్ లోనే హీరో నాగశౌర్య, హీరోయిన్ సాయిపల్లవికి మద్య అభిప్రాయబేధాలొచ్చాయి. ఆ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పేశాడు నాగశౌర్య. రీసెంట్ గా జరిగిన కణం ప్రచారానికి కూడా హాజరవ్వలేదు. సో.. హీరో గారి ప్రచారం లేకుండానే కణం థియేటర్లలోకి వస్తోందన్నమాట.