cloudfront

Advertisement


Home > Movies - Movie News

ట్రయిలర్ రిలీజైంది.. వివాదం బయటపడింది

కొన్నినెలల కిందటి మాట... ఎన్టీఆర్ బయోపిక్ ను హ్యాండిల్ చేయడానికి ముందు క్రిష్ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కంగనాను లీడ్ రోల్ లో పెట్టి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను మణికర్నిక పేరిట ఓ భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నాడు. అప్పట్లో ఏం జరిగిందో ఏమో సడెన్ గా ఆ సినిమా వదిలేసి హైదరాబాద్ వచ్చేశాడు క్రిష్. ఎన్టీఆర్ బయోపిక్ పనిలో పడిపోయాడు.

కంగనా రనౌత్ కు క్రిష్ కు మధ్య అభిప్రాయబేధాలు రావడం వల్లనే మణికర్నిక ప్రాజెక్టు నుంచి క్రిష్ బయటకు వచ్చినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. వీటిని ఓ సందర్భంలో క్రిష్, కంగనా ఇద్దరూ ఖండించారు. క్రిష్ దర్శకత్వంలోనే మణికర్నిక వస్తోందని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే... ఈరోజు రిలీజైన మణికర్నిక ట్రయిలర్ లో దర్శకుడిగా క్రిష్ పేరుతో పాటు తన పేరు కూడా వేసుకుంది కంగనా.

దీంతో అసలు మేటర్ బయటకొచ్చింది. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు నిజమే అనే విషయం బయటపడింది. దాదాపు 80శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు క్రిష్. మిగతా 20శాతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దగ్గరుండి పూర్తిచేసింది కంగనా రనౌత్. దీంతో దర్శకురాలిగా తన పేరు కూడా వేసుకుంది. అలా దర్శకురాలిగా కూడా మారింది ఈ హీరోయిన్.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వివాదాలు ఎదుర్కొంది. తన స్క్రిప్ట్ ను కాపీ కొట్టారంటూ అప్పట్లో బాలీవుడ్ కు చెందిన కేతన్ మెహతా న్యాయపోరాటానికి దిగాడు. ఆ తర్వాత క్రిష్ తప్పుకోవడంతో మణికర్నిక మరోసారి వివాదాస్పదమైంది. అలా అన్ని అడ్డంకుల్ని అధిగమించి జనవరి 25న థియేటర్లలోకి వస్తోంది మణికర్నిక.

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్