Advertisement

Advertisement


Home > Movies - Movie News

కంగ‌నా నీ టాపిక్స్ కు ప‌రిమితమైతే మేలేమో!

కంగ‌నా నీ టాపిక్స్ కు ప‌రిమితమైతే మేలేమో!

మొన్న‌టి వ‌ర‌కూ వాళ్లు వీళ్ల‌ను గోకారు, వీళ్లు వాళ్ల‌ను గోకారు.. వాళ్లు వీళ్లకు అది చూపించారు, త‌ను వాళ్ల‌కు ఇది చూపించానంటూ.. స్పందించిన న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు ఏకంగా సాగు బిల్లుల గురించి స్పందించేసింది! త‌న రంగం గురించి కంగ‌నా ఏం మాట్లాడినా కొంద‌రు స‌మ‌ర్థించారు. అయితే ఆమె వాద‌న‌లు మరీ విచిత్రంగా ఉండ‌టంతో కంగ‌నా ఒట్టి వ‌ద‌ర‌బోతు అనే అభిప్రాయాలూ ఏర్ప‌డ్డాయి.

ఒక‌వైపు నెపోటిజాన్ని నిందిస్తూ మ‌రోవైపు త‌నేదో అద్భుత‌మైన ఆర్టిస్ట్ అన్న‌ట్టుగా త‌న స‌హ‌చ‌ర న‌టీమ‌ణుల‌ను బీ గ్రేడ్ ఆర్టిస్టులు, పోర్న్ స్టార్లు అంటూ నిందిస్తూ కంగ‌నా త‌న ఆలోచ‌న తీరు ఎలాంటిదో చాటి చెబుతోంది.

ఇక డ్ర‌గ్స్ వాడ‌కం విష‌యంలో కూడా కంగ‌నా భిన్న ర‌కాల మాట‌ల‌ను చెప్పింది. ఆ పై త‌న‌కు కొంద‌రు హీరోలు జెనిట‌ల్స్ చూపించార‌ని ఆరోపించిన ఈమె అదెవ‌రో మాత్రం చెప్ప‌లేదు. అంత తీవ్ర‌మైన వేధింపులు ఎదుర్కొన్న‌ప్పుడు త‌న‌ను అలా వేధించిన‌ది ఎవ‌రో చెబితే, చ‌ట్టం చ‌ర్య‌లు తీసుకుంటుంది క‌దా! వారి పేర్ల‌ను కంగ‌నా చెప్ప‌డం లేదు!

ఉన్న‌ట్టుండి ఆ టాపిక్ ను వ‌దిలేసి కంగ‌నా.. సాగు బిల్లుల గురించి స్పందించేసింది! ఈమెకు వ్య‌వ‌సాయం మీద ఉన్న అవ‌గాహ‌న ఎంతో కానీ.. ఆ బిల్లుల గురించి కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. సాగు బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ ప‌లు రాజ‌కీయ పార్టీలు రోడ్డుకెక్కిన సంగ‌తి తెలిసిందే. ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉన్న అకాళీద‌ళ్ కూడా ఆ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ ఉంది. పంజాబ్, హ‌ర్యానాలోని పార్టీల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. 

మ‌రి సాగు బిల్లుల‌ను వ్య‌తిరేకించే రాజ‌కీయ పార్టీల నేతలు, రైతులు- రైతు సంఘాల వాళ్ల క‌న్నా త‌నకే సాగు గురించి ఎక్కువ తెలుస‌న్న‌ట్టుగా కంగ‌నా బిల్డ‌ప్ కొడుతోంది. వారంతా త‌ప్పుడు ప్ర‌చారాల‌ను చేసి రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నారంటూ ట్వీటేసింది! అయినా.. కంగ‌నా త‌న స‌బ్జెక్టుల గురించి మాట్లాడుకుంటే మాసాలా జ‌నాల‌కు మంచి  ఎంట‌ర్ టైన్ మెంట్ ఉంటుందేమో. ఇలాంటి వ్య‌వ‌సాయం- రైతులు వంటి టాపిక్ ల గురించి మాట్లాడేందుకు అయినా ఈమెకు ఏ అర్హ‌తుంద‌బ్బా?

ఎన్టీఆర్ ని చంపేశాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?