Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎవ‌రితోనూ త‌ను ప‌డ‌క‌ను పంచుకోలేన‌న్న స్టార్ హీరోయిన్!

ఎవ‌రితోనూ త‌ను ప‌డ‌క‌ను పంచుకోలేన‌న్న స్టార్ హీరోయిన్!

త‌ను చాలా స్వ‌తంత్ర భావాలు క‌లిగిన వ్య‌క్తినంటూ త‌న గురించి త‌ను చెప్పుకుంది కంగ‌నా ర‌నౌత్. త‌న స్వ‌తంత్ర భావాలు ఏ స్థాయివి అంటే... త‌ను ఎవ‌రి ప‌క్క‌నా క్యాజువ‌ల్ గా కూడా ప‌డుకోలేనంటూ ఈ న‌టీమ‌ణి స్టేట్ మెంట్ ఇచ్చింది. త‌న బెడ్ సెప‌రేట్ గా ఉండాలి, త‌ను అంత స్వ‌తంత్రాన్ని కోరుకుంటానంటూ.. ఎవ‌రితోనూ బెడ్ ను పంచుకునేది కూడా లేదంటూ కంగ‌నా ర‌నౌత్ చెప్పుకొచ్చింది. ఏ క్యాజువ‌ల్ డేట్ కో వెళ్లి ఎవ‌రితో అయినా కాసేపు బెడ్ మీద ప‌డుకున్నా.. ఆ త‌ర్వాత ఏ అర్ధ‌రాత్రో త‌ను లేచి వేరే బెడ్ మీద‌కు వెళ్లిపోవ‌డ‌మే ఉంటుంద‌ని త‌న హ్యాబిట్స్ ను వివ‌రించింది.

ఇంకా త‌న స్వ‌తంత్ర భావాల‌కు నిద‌ర్శ‌నంగా బోలెడ‌న్ని విష‌యాల‌ను చెప్పుకొచ్చింది కంగనా. కొంతమంది హీరోల స‌ర‌స‌న సినిమాల్లో న‌టించ‌డాన్ని నిరాక‌రించ‌డాన్ని కూడా త‌న గొప్ప‌ద‌నంగా చెప్పుకుంది. 'సంజూ'లో ర‌ణ్ బీర్ క‌పూర్ స‌ర‌స‌న‌, 'సుల్తాన్' లో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న అవ‌కాశాలు ముందుగా త‌న‌కే వ‌చ్చాయ‌ని, అయితే వాటిని త‌ను రిజెక్ట్ చేసిన‌ట్టుగా చెప్పుకొచ్చింది. ఇవ‌న్నీ త‌న స్వ‌తంత్ర భావాల‌కు నిద‌ర్శ‌నం అని ఆమె చెప్పుకున్న‌ట్టుగా ఉంది.

అయితే హీరోయిన్లు త‌మ కెరీర్ లో పైకి ఎదిగాకా.. కొన్ని త‌ర‌హా సినిమాల్లో న‌టించ‌డానికి ఒప్పుకోరు. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడు సాదాసీదా మాస్ సినిమాల్లో న‌టించ‌డానికి నో చెప్పే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి సినిమాల్లో న‌టించాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డ‌మే వారి స్వ‌తంత్ర‌త‌కు కార‌ణం! కెరీర్ ఆరంభంలో ఇదే కంగ‌నా ర‌నౌత్ ఎలాంటి సినిమాలు చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఒక‌వేళ అప్పుడే ఈమె  త‌న స్వ‌తంత్ర‌భావాల‌ను చాటి, అలాంటి సినిమాల్లో న‌టించ‌క‌పోయి ఉంటే అది స్వ‌తంత్ర‌భావం కింద‌కు వ‌చ్చేది. ఒక స్థాయికి ఎదిగాకా.. ఎవ‌రైనా స్వ‌తంత్ర భావాల‌ను క‌లిగి ఉండ‌గ‌ల‌రు. అది కూడా త‌న ఘ‌న‌త అయిన‌ట్టుగా చెప్పుకోవ‌డం ఏమిటో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?