Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ రాత్రి నుంచే ఓటీటీలో కాంతార

ఈ రాత్రి నుంచే ఓటీటీలో కాంతార

నిరీక్షణకు తెరపడింది. సుదీర్ఘ చర్చకు ఫుల్ స్టాప్ పడింది. సూపర్ హిట్టయిన కాంతర సినిమా, ఓటీటీ స్ట్రీమింగ్ కు డేట్ సెట్ అయింది. ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందా అనే చర్చకు అమెజాన్ తెరదించింది. రేపే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈరోజు అర్థరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో కాంతరను చూడొచ్చు.

థియేటర్లలో సూపర్ హిట్టయింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ 350 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఓవైపు తెలుగులో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న టైమ్ లో, ప్రైమ్ లోకి ఈ సినిమాను తీసుకువచ్చే అవకాశం లేదని చాలామంది భావించారు. అటు అమెజాన్ కూడా ఈ విషయంలో వేచిచూసే ధోరణిలో ఉంది.

అలా కొన్ని రోజులుగా కాంతర ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈరోజు ఆ చర్చకు ముగింపు పలుకుతూ, సడెన్ గా తేదీని ప్రకటించింది అమెజాన్. అయితే ఈ సినిమాను నేరుగా స్ట్రీమింగ్ కు పెడుతుందా లేక రెంట్ ప్రాతిపదికన తెరపైకి తెస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఓ హిట్ సినిమాను నేరుగా స్ట్రీమింగ్ కు పెట్టకుండా, కొంత అద్దె వసూలు చేసే పద్ధతిని చాన్నాళ్ల కిందటే అమెజాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కర్నాటకలో అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది కాంతర. కేజీఎఫ్-2 సృష్టించిన కొన్ని రికార్డుల్ని కూడా క్రాస్ చేసింది. ఆ తర్వాత తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఇక్కడ దాదాపు 22 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. చూస్తే థియేటర్లలోనే చూడాలనే టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. అందుకే అమెజాన్ లో ఈ సినిమాను ఇన్నాళ్లూ స్ట్రీమింగ్ కు పెట్టలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?