cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్

మరో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్

బాలీవుడ్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ మరోసారి తల్లి అయింది. ఈరోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో కరీనాను నిన్న జాయిన్ చేశారు. ఈరోజు ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్టు.. కరీనా బెస్ట్ ఫ్రెండ్ మనీష్ మల్హోత్రా, కజిన్ రిద్దిమా కపూర్ ప్రకటించారు.

2012లో కరీనా-సైఫ్ పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు నాలుగేళ్ల కొడుకు తైమూర్ ఉన్నాడు. గతేడాది లాక్ డౌన్ టైమ్ లో ఆమె మరోసారి గర్భవతి అయింది. 

ఇప్పుడు మరో మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కాగా ప్రెగ్నెన్సీ టైమ్ లో కరీనా ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ టైమ్ లో గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఆమె ఓ పుస్తరం రాసింది..

తొలి భార్య అమృతా సింగ్ ద్వారా సైఫ్ కు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె సారా అలీఖాన్, కొడుకు ఇబ్రహీం అలీఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. సారా అలీఖాన్ ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు కరీనాతో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు సైఫ్. 

చెవుల్లో పూలు పెట్టించుకునేంత అమాయకులా జనం

తెలంగాణలో రాజన్న రాజ్యం

 


×