cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఆర్య-సాయేషా ఎఫైర్.. కన్ ఫర్మ్ చేసిన కార్తి

ఆర్య-సాయేషా ఎఫైర్.. కన్ ఫర్మ్ చేసిన కార్తి

తమిళ హీరో ఆర్య, అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయేషా ఒకర్నొకరు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. కానీ వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారా లేక అవి కేవలం పుకార్ల అనే సందేహాలు మాత్రం చాలామందిలో ఉన్నాయి. ఇప్పుడీ సందేహాలకు తిరుగులేని సమాధానం ఇచ్చాడు హీరో కార్తి.

అటు ఆర్య, ఇటు సాయేషా ఇద్దరూ కార్తికి చాలా క్లోజ్. ఓ సినిమాలో సాయేషాతో కలిసి కార్తి నటించాడు కూడా. ఆర్య-సాయేషా ఎఫైర్ పై కార్తి పరోక్షంగా స్పందించాడు. తనకు చెప్పకుండా ఆర్య పెళ్లి చేసుకోడంటున్న కార్తి, ప్రస్తుతం ఆర్య తనమాట వినడంలేదని కేవలం ఒకే ఒక్కరి మాట వింటున్నాడని అన్నాడు.

ఆ ఒక్కరు ఎవరో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్య-సాయేషా ప్రేమించుకుంటున్నారనే విషయాన్ని కార్తి ఇలా పరోక్షంగా నిర్థారించాడు. తాజా సమాచారం ప్రకారం, ఆర్య-సాయేషా పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయట.

మరోవైపు హీరో విశాల్ పై కూడా రియాక్ట్ అయ్యాడు కార్తి. పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలపై చర్చిద్దామంటే విశాల్ దొరకడం లేదని, హనీమూన్ పూర్తయ్యేవరకు విశాల్ ఎవరిమాట వినడేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. హైదరాబాద్ కు చెందిన అనీషా అనే అమ్మాయితో విశాల్ పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. 

నా నోరు మూయించాలని చూశారు : వీరమాచినేని

పబ్లిక్ పల్స్ : ఆ నియోజకవర్గంలో జనసేనపై ఏమనుకుంటున్నారు..