cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఆ బ్రేకప్ మేలే చేసిందన్న స్టార్ హీరోయిన్!

ఆ బ్రేకప్ మేలే చేసిందన్న స్టార్ హీరోయిన్!

తన వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూల్లో కూడా పెద్దగా స్పందించదు కత్రినా కైఫ్. తన పర్సనల్ లైఫ్ ను కామ్ గా కొనసాగిస్తూ ఉంటుంది. అలాంటి కత్రినా రణ్ బీర్ తో కలిసి అనేక మందికి కనిపించింది. విదేశాల్లో విహరించిన ఫొటోలు కూడా మీడియాకు లభించాయి. దీంతో కత్రినా, రణ్ బీర్ లు ప్రేమలో ఉన్నారనే విషయంపై అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.

వీళ్లిద్దరూ సహజీవనం కూడా చేశారని కథనాలు వచ్చాయి. తమ లవ్ నెస్ట్ లో వీళ్లు స్టే చేశారు చాలాకాలం పాటు. ఇక పెళ్లే తరువాయి అనేమాట కూడా వినిపించింది. రణ్ బీర్ కుటుంబీకులు కూడా కత్రినాను కోడలిగా తెచ్చుకునేందుకు ఓకే చెప్పినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

వీరి పెళ్లి త్వరలో అని కొన్నాళ్ల పాటు ప్రచారం జరిగిన తర్వాత వీళ్ల బ్రేకప్ వార్తలు వచ్చాయి. రణ్ బీర్, కత్రినాలు విడిపోయినట్టుగా స్పష్టం అయ్యింది. తమ లవ్ నెస్ట్ ను అందంగా అలంకరించుకున్న కత్రినా అక్కడ నుంచి సూట్ కేస్ సర్దేసింది. ఆ తర్వాత ఆ అంశం గురించి ఈమె ఎక్కడా మాట్లాడలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాత్రం దానిపై స్పందించింది. రణ్ బీర్ పేరు కూడా ఎత్తలేదు కానీ.. ఆ బ్రేకప్ తనకు మేలే చేసిందని, తనలో చాలా పరిణతి తీసుకొచ్చిందన్నట్టుగా కత్రినా చెప్పింది. ఆ బ్రేకప్ ను తను బ్లెస్సింగ్ గా భావిస్తానని కూడా చెప్పింది.

కత్రినాతో బ్రేకప్ అనంతరం కొంతకాలం పాటు ఖాళీగా ఉండిన రణ్ బీర్ ప్రస్తుతం అలియా భట్ ను తగులుకున్నాడు. ఆమెతో ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించేశాడు. త్వరలోనే పెళ్లి అని కూడా అంటున్నారు.

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్