cloudfront

Advertisement


Home > Movies - Movie News

కట్టప్పకు కూడా విగ్రహం పెట్టేస్తున్నారోచ్..!

కట్టప్పకు కూడా విగ్రహం పెట్టేస్తున్నారోచ్..!

బాహుబలి సినిమాలో బాహుబలి మాత్రమే ఫేమస్ కాదు, అందులో నటించిన భళ్లాలదేవ, కట్టప్ప, శివగామి లాంటి పాత్రలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. మరి అలాంటప్పుడు ఒక్క బాహుబలికే విగ్రహం పెడితే ఎలా..? అందుకే ఇప్పుడు కట్టప్పకు కూడా విగ్రహం పెట్టాలని నిర్ణయించారు. అది కూడా లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో.

అవును.. లండన్ లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కట్టప్ప పాత్రలో ఉన్న సత్యరాజ్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఈ మేరకు మ్యూజియం నిర్వహకులు సత్యరాజ్ కు సమాచారం అందించారు. త్వరలోనే వచ్చి కొలతలు తీసుకుంటామని తెలిపారు.

ఇప్పటివరకు రజనీకాంత్, కమల్ హాసన్ కు కూడా దక్కని అరుదైన గౌరవం సత్యరాజ్ కు లభించింది. ఇంకా చెప్పాలంటే టుస్సాడ్స్ మ్యూజియంలోకి ఎంటరవుతున్న మొట్టమొదటి కోలీవుడ్ ప్రముఖుడు సత్యరాజ్. టుస్సాడ్స్ మ్యూజియంకు సంబంధించి ఈమధ్యే బ్యాంకాక్ లో ఓ బ్రాంచ్ తెరిచారు. బాహుబలి గెటప్ లో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటుచేశారు.

కానీ సత్యరాజ్ మైనపు విగ్రహాన్ని మాత్రం మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఏర్పాటు చేయబోతున్నారు. కోలీవుడ్ కు చెందిన ఖుష్బూ లాంటి ఎంతోమంది ప్రముఖులు సత్యరాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.