Advertisement


Home > Movies - Movie News
కేశవ నిడివి గంటా యాభై నిమషాలే

ఇటీవలి కాలంలో కాస్త రేంజ్ వున్న సినిమాలు ఏవీ కూడా రెండు గంటల పైగానే నిడివి వుంటున్నాయి కానీ, అంతకు లోపు కాదు. కొన్ని సినిమాలు అయితే రెండున్నర గంటల వరకు డేకేస్తున్నాయి. కొన్నింటిని విడుదల తరువాత కట్ చేసుకుంటున్నారు.

అలాంటిది ఈవారం విడుదల కాబోతున్న రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ కేశవ సినిమా నెట్ నిడివి జస్ట్ గంటా యాభై నిమషాలు మాత్రమే. స్టార్టింగ్ క్యాన్సర్ ఏడ్ లు, రోలింగ్ టైటిల్స్ అన్నీ కలుపుకున్నా కూడా రెండు గంటల లోపే. ఇలా క్రిస్ప్ గా వుండడం అన్నది థ్రిల్లర్లకు కలిసి వచ్చే అంశం. సోది లేకుండా, డైరక్ట్ గా సబ్జెక్ట్ నే డీల్ చేయడం అన్నది ఇలాంటి జోనర్ సినిమాలకు అవసరం. అన్నట్లు సుధీర్ వర్మ తన తొలి సినిమా స్వామి రారా ను కూడా గంటా యాభై మూడు నిమషాల్లో ముగించాడు.