Advertisement

Advertisement


Home > Movies - Movie News

'క్రాక్' పై ఛాంబర్ లో మీటింగ్

'క్రాక్' పై ఛాంబర్ లో మీటింగ్

నైజాం డిస్ట్రిబ్యూటర్లు శిరీష్ రెడ్డి కి, వరంగల్ శ్రీనుకు మధ్య నెలకొన్న వివాదం చాంబర్ మెట్లు ఎక్కింది. క్రాక్ కు రేపటి నుంచి థియేటర్లు ఇవ్వడంలో జరుగుతున్న తెరవెనుక రాజకీయం పై నిర్మాత టాగోర్ మధు నిర్మాతల కౌన్సిల్  కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. నిర్మాత టాగోర్ మధుతో పాటు, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కూడా కౌన్సిల్ కు సవివరమైన లేఖ రాసారు. 

ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు అన్నీ ఈ లేఖలో పూర్తిగా వివరించారు. అంతే కాదు 'స్టాక్ శ్రీధర్' అనే కొత్త క్యారెక్టర్ ను ఆయన తెరపైకి తెచ్చారు. ఆ వ్యక్తి థియేటర్ల యజమానులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

థియేటర్లు ఇలా దొరక్కుండా చేయడం వల్ల తనకు వచ్చిన నష్టాన్ని దిల్ రాజు, శిరీష్ రెడ్డి ల ద్వారా ఇప్పించాలని వరంగల్ శ్రీను కౌన్సిల్ ను కోరారు. మొత్తానికి ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతున్నట్లు కనిపిస్తోంది. 

తిట్టు..తిట్టించుకో..

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?