cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-3 కూడా ఉందా?

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-3 కూడా ఉందా?

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 7న రాబోతోంది. ఇప్పుడు ఎన్టీఆర్ పార్ట్-3 పై కూడా రియాక్ట్ అయ్యాడు దర్శకుడు క్రిష్. బాలకృష్ణ కోరితే, అవసరం ఉందనుకుంటే పార్ట్-3 కూడా తెరకెక్కిస్తానంటున్నాడు.

"రెండోభాగం (మహానాయకుడు) ఎక్కడ ముగుస్తుందనే విషయాన్ని నాకు నేనుగా చెప్పకూడదు. నిర్మాత (బాలకృష్ణ) అనుమతి ఉండాలి. అతను కోరుకుంటే, మరో పార్ట్ అవసరం ఉందనుకుంటే ఎన్టీఆర్ మూడోభాగం కూడా వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు."

ఇలా బయోపిక్ పార్ట్-3పై కూడా ఫీలర్లు వదిలాడు క్రిష్. రెండో భాగంలో లక్ష్మీపార్వతి పాత్ర ఉంటుందా ఉండదా అనే అంశంపై స్పందించడానికి నిరాకరించిన క్రిష్.. తను ఎంత వెదికినా ఎన్టీఆర్ జీవితంలో లోపాలు కనిపించలేదంటున్నాడు.

"ఎన్టీఆర్ మొండితనం చూపించాం. ఆయన ఆవేశం చూపించాం. ఇంతకంటే ఇంకేం చూపించగలం. లోపాల గురించి ఎవరూ అడగలేదు. అయినప్పటికీ ఆ లోపాల్ని చూపించడం కోసం కష్టపడి వెదికాను. పరిపాలనలో ఎన్టీఆర్ మొండితనం, ఆవేశం, నిర్ణయాలు ఫాస్ట్ గా తీసుకోవడం లాంటి లోపాల్ని మీరు మహానాయకుడు సినిమాలో చూస్తారు."

మొదటి సినిమాలో మొండితనం అనే లోపాన్ని చూపించామని, అసలైన లోపాల్ని రెండోపార్టులో చూపిస్తామంటున్నాడు క్రిష్. సావిత్రి బయోపిక్ లో కాన్ ఫ్లిక్ట్, ట్రాజెడీ ఉంది కాబట్టి అది బాగా పండిందని... ఎన్టీఆర్ జీవితంలో ఎత్తులే తప్ప పల్లాలు లేవని అంటున్నాడు ఈ డైరక్టర్.

రామాయణంలో రాముడి కదలికల్ని ఎలాగైతే చెప్పారో, ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ వ్యక్తి జీవితాన్ని చెప్పే ప్రయత్నం చేశానంటున్నాడు క్రిష్. 

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు