cloudfront

Advertisement


Home > Movies - Movie News

కేటీఆర్ అనే నేను.. సినిమా చూశాను

కేటీఆర్ అనే నేను.. సినిమా చూశాను

మహేష్-కొరటాల కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సినిమాను చాలామంది టాలీవుడ్ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. ఈ లిస్ట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా చేరారు. భరత్ అనే నేను సినిమాను చూసిన కేటీఆర్, ఆ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. మహేష్ నటనతో పాటు, కొరటాల శివ టేకింగ్ ను కేటీఆర్ ప్రశంసించారు.

కేవలం ఇక్కడితో ఆగలేదు కేటీఆర్. భరత్ అనే నేను సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు మహేష్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇందులో కేటీఆర్ ను మహేష్ ఇంటర్వ్యూ చేశాడా.. లేక మహేష్ ను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారా అనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రస్తుత రాజకీయాలకు ఈ సినిమాను ముడిపెడుతూ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. వీటిలో ముఖ్యమైన అంశం లోకల్-గవర్నెన్స్(స్థానిక స్వపరిపాలన).

సినిమాలో మహేష్ చేసిన భరత్ రామ్ అనే పాత్రకు దగ్గరగా కేటీఆర్ జీవితం కూడా ఉంది. రాజకీయాల్లోకి రాకముందు, సినిమాలో భరత్ లానే కేటీఆర్ కూడా విదేశాల్లో ఉన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో చేరి, ఎన్నికల బరిలో నిలిచి మంత్రి అయ్యారు. ఈ అనుభవాలన్నీ ప్రమోషనల్ వీడియోలో ఉన్నాయి. త్వరలోనే ఈ వీడియోను మీడియాకు ఇవ్వబోతున్నారు.