పోర్న్ ఫిల్మ్ చిత్రీకరణ సూత్రధారిగా అరెస్టు అయిన రాజ్ కుంద్రా విషయంలో ఆయన సన్నిహితులు, లాయర్లు ఎరోటికా వాదనను తీసుకొచ్చారు. రాజ్ కుంద్రా సినిమాలు తీసిన విషయం నిజమని ఒప్పుకుంటూనే, అయితే అవి పోర్న్ ఫిల్మ్ లు కాదని వారు అంటున్నారు. అవి కేవలం ఎరోటికా కేటగిరి సినిమాలు మాత్రమే అని వారు అంటున్నారు. పోర్న్ ఫిల్మ్ లు కాదని వాదిస్తున్నారు. రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ విషయంలో కూడా ఇదే వాదనను వినిపిస్తున్నారు.
రాజ్ కుంద్రా ఆధ్వర్యంలో రూపొందిన ఆ సినిమాలు లైంగికోద్రేకాన్ని కలిగించే సినిమాలు అయితే అయ్యండొచ్చని.. అంత మాత్రాన వాటిని పోర్న్ సినిమాలు అనడానికి లేదని ఆయన లాయర్లు వాదించారు. వాటిల్లో అభ్యంతకరమైన శృంగారాన్ని చూపలేదంటున్నారు. పోర్న్ సినిమాల్లో చూపిన తరహాలో వాటిల్లో చిత్రీకరణ లేదని వారి వాదనగా తెలుస్తోంది.
కుంద్రాతో పని చేసిన కొందరు కూడా అదే వాదనే వినిపిస్తున్నారు. అవి పోర్న్ కాదని, కేవలం ఎరోటికా మాత్రమే అని అంటున్నారు. ఇక తన మరదలు షమితా షెట్టిని ముందు పెట్టి ఒక సినిమాను రూపొందించాలని కూడా రాజ్ కుంద్రా అనుకున్నారట.
త్వరలోనే ఒక యాప్ ను మొదలుపెట్టి.. అందులో సినిమాలు, బాలీవుడ్ స్టఫ్, చాట్ షోలు పెట్టాలనేది కుంద్రా ప్రణాళిక అట. ఆ విషయంలో శిల్పా షెట్టి కూడా పని చేయాలనుకున్నదని బాలీఫేమ్ పేరుతో యాప్ ను ప్రారంభించాలని కుంద్రా అనుకున్నాడట.
ఇంతలోనే ఇలా అరెస్టు జరిగిందని కుంద్రాతో కలిసి పని చేసిన ఒక నటి చెప్పింది. కుంద్రా తీసినవి పోర్న్ ఫిల్మ్ లు కావని, కేవలం అవి కామోద్రేకం కలిగించే తరహావే అని ఆమె కూడా వాదించింది.