Advertisement

Advertisement


Home > Movies - Movie News

కుర్రాడిని లైన్లో పెట్టే సినిమా

కుర్రాడిని లైన్లో పెట్టే సినిమా

ఆర్ఎక్స్ 100 తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు హీరో కార్తికేయ. కానీ ఆ తరువాత వరుసగా ఎన్ని సినిమాలు పడినా ఒక్కొటి అతగాడి కెరీర్ ను ముందుకు తీసుకెళ్లలేదు. గాడిలో పెట్టలేదు.

ఇలాంటి టైమ్ లో బన్నీ వాస్ నిర్మాతగా గీతా 2లో సినిమా వచ్చింది. చావు కబురు చల్లగా అన్నది టైటిల్. టైటిల్ చిత్రంగా వుంది అని ఇన్నాళ్లు సినిమా జనాలు అనుకుంటూ వుండగానే ఇప్పుడు టీజర్ వచ్చింది. ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

సినిమాలో హీరో శవాల వెహికల్ డ్రయివర్. పక్కా స్లమ్ క్యారెక్టర్. మాస్ జోనర్. టీజర్ కట్ తో సినిమా మీద మంచి ఇంప్రెషన్ ఇచ్చారు. ఆ విషయం ఎలా వున్నా, కార్తికేయ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా వుంది. పక్కాగా అతన్ని ఓ గాడిలో పెట్టేలా వుంది. 

గీతా 2 నుంచి మళ్లీ ఓ సరైన చిన్న సినిమా వస్తున్న ఫీల్ ను అయితే ఈ టీజర్ కలిగించింది. కౌశిక్ దర్శకుడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?