cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

యాంక‌ర్ ర‌వి ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టిన లాస్య‌

యాంక‌ర్ ర‌వి ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టిన లాస్య‌

బుల్లితెర‌పై యాంక‌ర్ ర‌వి-లాస్య జోడి చాలా పాపులారిటీ సంపాదించుకుంది. పేరుకు త‌గ్గ‌ట్టుగానే వారి జోడి బుల్లితెర‌పై సమ్‌థింగ్‌ స్పెషల్‌. కొన్ని కారణాల వల్ల బుల్లితెర‌పై ఆ జ‌డి విడిపోయింది. ఆ త‌ర్వాత బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా లాస్య పాపులారిటీ ఓ రేంజ్‌కు చేరుకుంది. 

బిగ్‌బాస్ హౌజ్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఆమె మ‌రింత బిజీ అయ్యారు. సొంత యూట్యూబ్ చాన‌ళ్లు పెట్టుకుని మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్టు సంపాద‌న‌కు సంపాద‌న‌, సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీ ద‌క్కాయి.

దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు యాంక‌ర్ ర‌వి, లాస్య క‌లిసిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మరోసారి ఆన్‌స్ర్కీన్‌పై రవి-లాస్య సందడి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ఇంటర్వ్యూలో రవి-లాస్య పాల్గొన్నారు. ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా రవికి సంబంధించిన ఓ ర‌హ‌స్యాన్ని లాస్య బయటపెట్టేసింది.

సోషల్‌ మీడియా, ఫోన్‌, శానిటైజర్‌..ఈ మూడు లేకుండా రవి బతకలేడనేదే ఆ ర‌హ‌స్యం. ఈ మూడు లేనిదే ర‌వి ఎక్క‌డికీ వెళ్ల‌డ‌ని లాస్యం తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యం కాబ‌ట్టి అంద‌రూ శానిటైజ‌ర్ గురించి మాట్లాడుకుంటున్నార‌ని, అంత‌కు ముందు నుంచి ర‌వి దాన్ని వాడుతున్న‌ట్టు లాస్య తెలిపారు. 

ర‌వి కారులో ఎప్పుడూ ఓ శానిటైజర్‌ బాటిల్‌ ఉంటుందని, ఏదైనా ట‌చ్ చేస్తే  వెంటనే శానిటైజర్‌ రాసుకుంటాడని చెప్పుకొచ్చారామె.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×