Advertisement

Advertisement


Home > Movies - Movie News

లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ పూర్తయిందా?

లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ పూర్తయిందా?

హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం అయిపోయిందా? త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందా...? ఈ పుకార్లు రావడానికి కారణం లావణ్య వేలికి ఉన్న ఉంగరం. ఇది చూసి చాలామంది నెటిజన్లు ఆమెకు ఎంగేజ్ మెంట్ అయిందని, త్వరలోనే పెళ్లి ఉంటుందని అనుకున్నారు. వీటిపై లావణ్య త్రిపాఠి స్పందించింది.

తనకు నిశ్చితార్థం అవ్వలేదని క్లారిటీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. అయినా అమ్మాయిలు వేలికి ఉంగరం పెట్టుకుంటే ఎంగేజ్ అయినట్టేనని ఎలా అనుకుంటారంటూ ప్రశ్నిస్తోంది ఈ లావణ్యం. పుట్టినరోజు సందర్భంగా తను ఎంతో ఇష్టపడి ఆ ఉంగరం కొనుక్కున్నానని, అది ఎంగేజ్ మెంట్ రింగ్ కాదని తెలిపింది.

మరోవైపు తన పెళ్లిపై కూడా స్పందించింది ఈ బ్యూటీ. ఇప్పటివరకు తన తల్లిదండ్రులే పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదని, సోషల్ మీడియాలో మాత్రం చాలామందికి తనను పెళ్లి గురించి అడుగుతున్నారని బాధపడింది.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేతిలో చావుకబురు చల్లగా, ఏ-1 ఎక్స్ ప్రెస్ సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాపై ఈ బ్యూటీ చాలా ఆశలు పెట్టుకుంది.

కృష్ణమ్మ పరవళ్లు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?