cloudfront

Advertisement


Home > Movies - Movie News

లావెక్కిన చిరంజీవి.. రీజన్ అదే!

లావెక్కిన చిరంజీవి.. రీజన్ అదే!

మామూలుగానే కాస్త లావుగా కనిపిస్తారు చిరంజీవి. కానీ ఈసారి అది తన ముఖంలో కూడా కనిపిస్తోంది. బుగ్గలు బాగా పైకి వచ్చేసి, పొట్ట ముందుకొచ్చి పూర్తిగా ఫిట్ నెస్ కోల్పోయినట్టు అనిపిస్తోంది. చిరంజీవి ఎందుకిలా సడెన్ గా మారిపోయారంటూ రీసెంట్ గా చాలా కథనాలు పుట్టుకొచ్చాయి. వాటన్నింటికీ ఇప్పుడో సమాధానం దొరికింది.

చిరంజీవి కావాలనే కాస్త వయసు మళ్లిన వ్యక్తిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారట. దీనికి కారణం సైరా సినిమా. సినిమాలో ఓ గెటప్ కోసం చిరంజీవి ఇలా మారిపోయారట. ఇది మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సన్నివేశాల్ని కోకాపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నైట్ మోడ్ లో చిత్రీకరిస్తున్నారు.

ఈ సెట్ కోసం కోకాపేటలో ఏడెకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ వేసిన భారీ సెట్ లో నైట్ ఎఫెక్టులో చిరంజీవిపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గ్రెగ్ పోవెల్ ఈ పోరాట సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నాడు. గతంలో ఇతడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, హ్యారీ పోటర్ సిరీస్, స్కైఫాల్ లాంటి సినిమాలకు పనిచేశాడు. 

తాజా షెడ్యూల్ లో త్వరలోనే చిరంజీవితో పాటు విజయ్ సేతుపతి, తమన్న కూడా చేరబోతున్నారు. సినిమాకు సంబంధించి అతిపెద్ద షెడ్యూల్ ఇదేనని తెలుస్తోంది. మరో నెల రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్ తర్వాత చిరంజీవి మళ్లీ కసరత్తులు చేసి ఫిట్ గా మారతారని అంటోంది యూనిట్. 

దాదాపు 6 నెలలుగా సైరా షూటింగ్ జరుగుతోంది. కానీ ఇప్పటివరకు 30శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కేవలం అమితాబ్ బచ్చన్ ఎపిసోడ్ ను మాత్రం కంప్లీట్ గా పిక్చరైజ్ చేసినట్టు చెబుతున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేస్తారట. ఇక సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, ఆ టైమ్ కు మూవీ రెడీ అవ్వదని తెలుస్తోంది.